సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భగత
తిరుమలగిరి(సాగర్), మే 28: నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన ప రిధితో పాటు ఇతర ఫారెస్ట్ ప్రాంతంలో అ డవుల సంరక్షణ, అభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని ఎమ్మెల్యే భగత అన్నారు. శనివారం అర్బన పార్క్లో నిర్వహించిన స మీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు అడవులను ధ్వంసం చేయకుండా వాటిని సంరక్షించేందుకు సహకరించాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో పోడు భూముల రైతుల వివరాలు, ఇతర ఫారెస్ట్ అఽభివృద్ధి పనుల గు రించి సమీక్షించారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఇ స్లావత రామచందర్నాయక్, డీఎ్ఫవో సర్వేశ్వర్ సీఐ నాగరాజు, ఎస్ఐలు పెదపంగబాబు, పరమేష్, రాంబాబు, ఎఫ్ఆర్వో సాయిప్రకాశ, బీట్ ఆఫీసర్లు ర మేష్, మానస, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.