లోతట్టు ప్రాంత ప్రజలకు సహాయ సహకారాలు అందించాలి

ABN , First Publish Date - 2021-07-25T06:12:55+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు ఇంకా జలమయమై ఉన్నాయని, అక్కడి ప్రజలకు సహాయ సహకారాలు అంది ంచడానికి పోలీసు సిబ్బంది అందుబాటులోఉండాలని నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డి సూచించారు.

లోతట్టు ప్రాంత ప్రజలకు సహాయ సహకారాలు అందించాలి
పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఐజీ శివశంకర్‌రెడ్డి

పోలీసు సిబ్బందికి ఐజీ శివశంకర్‌రెడ్డి ఆదేశం
ఖిల్లా, జూలై 24: ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు ఇంకా జలమయమై ఉన్నాయని, అక్కడి ప్రజలకు సహాయ సహకారాలు అంది ంచడానికి పోలీసు సిబ్బంది అందుబాటులోఉండాలని నిజామాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌రెడ్డి సూచించారు. శనివారం సీపీ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న వరద పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసుశాఖ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అందుకుగాను మూడు రెస్క్యూటీ ంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజల భద్రత కోసం ప్రత్యేక డ్రెస్‌కో డ్‌ వాడి 24 విధులు గంటలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు వర్షాల వల్ల నష్టాలు కలగకుండా అనుక్షణం కాపాడాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు అయిన మట్కా, గుట్కా, అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని ఎ వరైనా చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే ఉపేక్షించరాదన్నారు. బక్రీద్‌ పండ గ శాంతియుత వాతావరణంలో నిర్వహించినందుకు సిబ్బందిని అభినందించా రు. జిల్లా పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు కరోనా వ్యాక్సిన్‌ తప్పకుం డా ఇప్పించాలని తెలిపారు. జిల్లావ్యాప్తంగా నేరాల నియంత్రణకు తీసుకుంటు న్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సీపీ కార్తికేయ, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ లా అండ్‌ ఆర్డర్‌ రఘువీర్‌, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అర్వింద్‌బాబు, అదనపు డీసీపీ ఏఆర్‌ భాస్కర్‌, అదనపు డీసీపీ శ్రీనివాస్‌కుమార్‌, నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌, ఏసీపీలు వెంకటేశ్వర్లు రామారావు, రఘు, రాఘవేందర్‌, రాజరాజేశ్వర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T06:12:55+05:30 IST