డ్రగ్స్ విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయిన Assistant Choreographer

ABN , First Publish Date - 2022-08-27T17:32:09+05:30 IST

సినీ ఇండస్ట్రీ(Cine Industry) డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోందనే విమర్శలు చాలానే వినవస్తున్నాయి.

డ్రగ్స్ విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయిన Assistant Choreographer

Hyderabad : సినీ ఇండస్ట్రీ(Cine Industry) డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోందనే విమర్శలు చాలానే వినవస్తున్నాయి. డ్రగ్స్ బాగోతం టాలీవుడ్(Tollywood) చుట్టూ తిరగడం, ఆగిపోవడం ఇప్పటికి చాలా సార్లు జరిగింది. పదుల కొద్దీ సినీ జనాలను ఈ కేసులో విచారించడం ఆపై అధికారులు క్లీన్ చిట్ ఇవ్వడం సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా ఎండీఎంఏ డ్రగ్స్ (MDMA Drugs) విక్రయిస్తూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపికృష్ణ ఎస్‌ఓటీ పోలీసుల(SOT Police)కు అడ్డంగా దొరికిపోయాడు. విశ్వసనీయ సమాచారం మేరకు హఫీజ్ పేట్ గోకుల్ ప్లాట్స్‌లో నిందుతున్ని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్దీ రోజులుగా గోవా(Goa) నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో గోపాలకృష్ణ విక్రయిస్తున్నడన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. గోవా నుంచి తెచ్చి ఎవరెవరికి సప్లై చేస్తున్నాడన్న దానిపై పోలీసులు అరా తీస్తున్నారు. 55 వేలు విలువ చేసే 10 గ్రాముల ఎండీఎంఏ టాబ్లెట్స్(MDMA Tablets), హ్యాష్ ఆయిల్, ఒక సెల్‌ఫోన్‌(Cellphone)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. 


Updated Date - 2022-08-27T17:32:09+05:30 IST