సబ్‌రిజిస్ట్రార్‌ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-06-28T04:42:24+05:30 IST

కనిగిరి సబ్‌ రిజిస్ర్టార్‌గా పి.గిరిజ సోమవారం బాధ్య తలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన జీ రాధా కృష్ణమూర్తి చీరాల సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి బదిలీ అయ్యారు.

సబ్‌రిజిస్ట్రార్‌ బాధ్యతల స్వీకరణ
రిజిస్ట్రేషన్‌ కోసం కార్యాలయానికి వచ్చిన జనం

కనిగిరి, జూన్‌ 27 : కనిగిరి సబ్‌ రిజిస్ర్టార్‌గా పి.గిరిజ సోమవారం బాధ్య తలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వహించిన జీ రాధా కృష్ణమూర్తి చీరాల సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి బదిలీ అయ్యారు.    పొది లి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం నుంచి గిరిజ బదిలీపై కనిగిరి వచ్చారు. 

ఆరు నెలలుగా నిలిచిన రిజిస్ట్రేషన్‌లు.. తిరిగి మొదలు

వారం కింద కన్వర్షన్‌, ప్లాన్‌ అప్రూవల్‌ కాని వెంచర్ల రిజిస్ట్రేషన్‌లు నిలి పివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.  అప్పటి నుంచి కనిగిరి ప్రాంతంలో దాదాపూ వెంచర్ల రిజిస్ర్టేషన్‌లు నిలిచిపోయాయి.  దీంతో వెంచర్ల నిర్వాహ కులు నష్టాల ఊబిలోకి వెళ్లే సమయంలో కోర్టు ఆదేశాలతో రిజిస్ట్రేషన్‌లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో అమ్మకం, కొనుగోలు దారులు ఊపిరి పీల్చుకున్నారు. వారం నుంచి రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. ఈ సమ యం లో సబ్‌రిజిస్ర్టార్‌ బదిలీతో కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్‌లు సక్రమంగా సాగ డం లేదు.  సోమవారం సబ్‌రిజిస్ర్టార్‌ బాధ్యతలు స్వీకరిం చడంతో సోమ వారం రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారితో కార్యాలయం కిటకిటలాడింది. 


Updated Date - 2022-06-28T04:42:24+05:30 IST