ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

ABN , First Publish Date - 2021-07-27T04:52:16+05:30 IST

ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు.

ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

ప్రొద్దుటూరు టౌన్‌, జూలై 26: ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. సోమవారం మండల కార్యాలయంలో ఈ నెల 29న జరిగే ధర్నా కరపత్రాలను ఆయన ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి 29వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా తాలూకా కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.  ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు 55 శాతం ఫిట్‌మెంట్‌తో 2018 జూలై 1 నుంచి పీఆర్‌సీని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు విడతల డీఏ బకాయిలను చెల్లించడంతోపాటు సీపీఎస్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని కోరారు. నూతన విద్యావిధాన ం పేరుతో ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను తరలించవద్దని, ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషుమీడియంలను కొనసాగించాలని సూచించారు.  ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుని పోస్టును మంజూరు చేయాలని  మొత్తం 28 డిమాండ్లతో ధర్నా నిర్వహిస్తున్నామని, ఉపాధ్యాయులు ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కుళాయిరెడ్డి, మునివర్ధన్‌కుమార్‌, రమే్‌షరెడ్డి, చంద్రశేఖర్‌, హమీన్‌, సుధాకర్‌, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:52:16+05:30 IST