టీడీపీ సభ్యత్వంతో కార్యకర్తలకు భరోసా

ABN , First Publish Date - 2022-05-17T06:46:11+05:30 IST

టీడీపీ సభ్యత్వం స్వీకరించిన ప్రతి సభ్యుడికి పార్టీ కొండంత అండగా ఉంటుందని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు.

టీడీపీ సభ్యత్వంతో కార్యకర్తలకు భరోసా
సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తున్న ఎరిక్షన్‌బాబు

 ఎర్రగొండపాలెం, మే 16 : టీడీపీ సభ్యత్వం స్వీకరించిన ప్రతి సభ్యుడికి పార్టీ కొండంత అండగా ఉంటుందని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపు మేరకు ఎర్రగొండపాలెంలో సోమవారం ఆయన సభ్యత్వ నమోదు కౌంటరును ప్రారంభించారు. ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ.. రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకన్న ప్రతి సభ్యుడికి రూ. 2 లక్షలు ప్రమాద బీమా ఉంటుందన్నారు. అదే విధంగా వైద్యసేవలందించేందుకు పార్టీ కొన్ని ఆస్పత్రులను కూడా ఎంపిక చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రతి కార్యకర్త విధిగా సభ్యత్వం స్వీకరించాలన్నారు. ఈ సభలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టరు మన్నె రవీంద్ర  మాట్లాడుతూ దేశంలో లేనంత మంది క్రియాశీలక సభ్యులు టీడీపీకి ఉన్నారన్నారు.  గ్రామాల్లో ఉన్న గ్రామకమిటి అధ్యక్ష కార్యదర్శులు ప్రత్యేక శ్రద్థలతో సభ్యత్వాలు నమోదు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు, ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.మంత్రునాయక్‌, మాజీ  సర్పంచ్‌ సత్యనారాయణబాబు, మైనార్టిసెల్‌ కార్యదర్శి  యూసఫ్‌, టీడీపీ  రాష్ట్ర కార్యదర్శి షేక్‌ కరిముల్లా, టీడీపీ నేతలు కామేపల్లి వెంకటేశ్వర్లు, షేక్‌ జిలానీ, వడ్లమూడి లింగయ్య,  శనగా నారాయణరెడ్డి,  వేగినాటి శ్రీను, తోట మహేష్‌, కొత్తమాస్‌ వెంకట సుబ్రహ్మణ్యం, పొట్ల గోవింద్‌,  ఎ రామచంద్రరావు,  జి.కనకారావు, కోటా డేవిడ్‌, చేదూరి లక్ష్ముయ్య, చేదూరి కిశోర్‌, కొత్త బాస్కర్‌, షేక్‌ ఇస్మాయిల్‌, షేక్‌ మస్తాన్‌వలి, కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు.

కంభం(బేస్తవారపేట): కంభం పట్టణంలో సోమవారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దిగ్విజయంగా  నిర్వహిస్తున్నారు. టీడీపీ సీనియర్‌ కార్యకర్త సయ్యద్‌ హుస్సేన్‌ పీరాకు సభ్యత్వం రెన్యూవల్‌ చేశారు. కంభం పట్టణంలో వీధివీధికి తిరిగి సభ్యత్వ నమోదు కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్‌ మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యాదర్శి సయ్యద్‌ అనీస్‌ అహ్మద్‌, కార్యనిర్వాహక కార్యదర్శి అత్తర్‌ షేక్‌ హుస్సేన్‌(దాదా), కంభం మండల అధ్యక్షుడు షేక్‌ గౌస్‌ బాష, సయ్యద్‌ హర్షద్‌, కె.రవి తదితరులు పాల్గొన్నారు


Updated Date - 2022-05-17T06:46:11+05:30 IST