దక్షిణ భారతదేశంలో ఉనికిని చాటుకుంటున్న ‘ఆస్ట్రల్’

ABN , First Publish Date - 2022-06-22T00:18:20+05:30 IST

బిల్డింగ్ మెటీరియల్స్ అందించే అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఆస్ట్రల్ లిమిటెడ్ దక్షిణ భారత మార్కెట్లో తన ఉనికిని మరింత

దక్షిణ భారతదేశంలో ఉనికిని చాటుకుంటున్న ‘ఆస్ట్రల్’

న్యూఢిల్లీ: బిల్డింగ్ మెటీరియల్స్  అందించే అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఆస్ట్రల్ లిమిటెడ్ దక్షిణ భారత మార్కెట్లో తన ఉనికిని మరింత పటిష్ఠం చేసుకునే చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో జట్టు కట్టింది. తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆస్ట్రల్‌కు చెందిన కైరవ్ ఇంజినీర్ మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌తో ఒప్పందంతో తాము కీలక మైలురాయిని చేరుకున్నట్టు చెప్పారు.


దక్షిణ భారత రాష్ట్రాల్లో తమ బ్రాండ్ ఈక్విటీని తిరిగి బలోపేతం చేసుకునే లక్ష్యంతో అల్లు అర్జున్‌ను భాగస్వామిగా చేసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మార్కెట్లో తాము మరింతగా నిలదొక్కుకునేందుకు ఈ బంధం తోడ్పడుతుందని అన్నారు. నటుడు అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నాణ్యతకు, నూతన ఆవిష్కరణలకు ఆస్ట్రల్ ప్రసిద్ధి చెందినదని అన్నారు. అలాంటి కంపెనీతో జత కడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు.  

Updated Date - 2022-06-22T00:18:20+05:30 IST