ఆస్ట్రాజెనెకా ‘కాక్టెయిల్’ ఫెయిల్
ABN , First Publish Date - 2021-06-16T06:20:47+05:30 IST
కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా కంపెనీ.. మోనోక్లోనల్ యాంటీబాడీ ఔషధం ‘ఏజెడ్‌డీ7442’పై జరుపుతున్న ప్రయోగ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ ఔషధాన్ని
మూడోదశ ప్రయోగ పరీక్షల్లో గుర్తింపు
లండన్, జూన్ 15 : కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా కంపెనీ.. మోనోక్లోనల్ యాంటీబాడీ ఔషధం ‘ఏజెడ్‌డీ7442’పై జరుపుతున్న ప్రయోగ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ ఔషధాన్ని రెండు రకాల కృత్రిమ యాంటీబాడీల సమ్మేళనం (కాక్టెయిల్)గా రూపొందించారు. అధ్యయనంలో భాగంగా అమెరికా, బ్రిటన్లలో ఆరోగ్యవంతులైన వలంటీర్లను ఎంపిక చేసి.. కరోనా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులకు సమీపంగా ఉండే ఏర్పాట్లు చేశారు. అనంతరం వారిలో కొవిడ్-19 లక్షణాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్న క్రమంలో యాంటీబాడీ కాక్టెయిల్ ఔషధాన్ని అందించారు. అయితే దీని ప్రభావంతో కేవలం 33 శాతం మందిలోనే కొవిడ్ లక్షణాలు తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు.