భూమికి చేరువగా వెళ్లిన ఉల్క.. 2 రోజుల తర్వాత కనుగొన్న శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2020-07-07T23:35:12+05:30 IST

రెండు రోజుల క్రితం ఓ ఉల్క భూమికి అతి చేరువ నుంచి వెళ్లింది. అయితే ఈ విషయం శాస్త్రవేత్తలు ...

భూమికి చేరువగా వెళ్లిన ఉల్క.. 2 రోజుల తర్వాత కనుగొన్న శాస్త్రవేత్తలు

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఏదైనా గ్రహశకలం భూమకి వేల కిలోమీటర్ల దూరంలో ఉండగానే శాస్త్రవేత్తలు తెగ హల్‌చల్ చేస్తారు. అయితే గతనెలలో ఓ భారీ ఉల్క భూమికి అతి చేరువగా వచ్చినా గుర్తించలేకపోయారు. రెండు రోజుల తరువాత విషయం తెలియడంతో నాలుక్కరుచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జూన్ 5వ తేదీన ఓ ఉల్క భూమికి అతి చేరువ నుంచి వెళ్లింది. అయితే ఈ విషయం శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. తీరా ఆ గ్రహశకలం భూమిని దాటి వెళ్లిపోయిన తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్‌ఏ) దీనిని గుర్తించింది. దీంతో ఎంత ప్రమాదం తప్పింది అని ఊపిరి పీల్చుకున్నారు. దీనిని ఈఎస్ఏ నేడు ధృవీకరించింది. గ్రహశకలం భూమిని దాటిన విషయాన్ని జూన్ 7న గుర్తించామని వివరించింది. గ్రహశకలం దాదాపు 89 నుంచి 200 మీటర్ల వ్యాసంతో ఉందని తెలిపింది. చంద్రుడికి భూమికి ఉన్న దూరం కంటే దాదాపు 20శాతం చేరువ నుంచి ఇది వెళ్లిందని వెల్లడించింది.


భూమి నుంచి చంద్రుడి దూరం 3,84,400 కిలోమీటర్లనీ, కానీ ఈ గ్రహశకలం 3,07,454 కిలోమీటర్ల దూరం నుంచి భూమిని దాటిందని ఈఎస్‌ఏ వెల్లడించింది. దీనికి 2020ఎల్‌డీ  అని పేరు పెట్టినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే భూమికి చేరువగా వచ్చిన గ్రహశకలాల్లో ఇది మాత్రమే పెద్దది కాదని, అయితే 2011 తర్వాత ఇంత పెద్ద గ్రహశకలం చంద్రుడికంటే చేరువగా రావడం ఇదే తొలిసారని ఈఎస్ఏ వివరించింది.

Updated Date - 2020-07-07T23:35:12+05:30 IST