ఇంటి వద్దకే.. రేషన్‌

ABN , First Publish Date - 2021-01-22T05:24:37+05:30 IST

ఇకపై నాణ్యమైన రేషన్‌ సరుకులు ఇంటి వద్దకే ప్రభుత్వం చేరవేస్తుందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. కేఆర్‌ స్టేడియంలో గురువారం నిర్వహించిన రేషన్‌ సరుకుల రవాణా వాహనాల(మినీ ట్రక్కులు) ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇక నుంచి రేషన్‌ సరుకుల కోసం డిపోల వద్ద క్యూలైన్‌లో నిల్చొని అవస్థలు పడాల్సిన అవసరంలేదని తెలిపారు. తూకంలో అక్రమాలకు అవకాశం లేకుండా ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రతి ఇంటికీ నాణ్యమైన బియ్యాన్ని వాహనాల ద్వారానే సరఫరా చేస్తామన్నారు.

ఇంటి వద్దకే.. రేషన్‌
వాహనాల ర్యాలీని ప్రారంభిస్తున్న ఉపముఖ్యమంత్రి

  సరుకుల తూకంలో అక్రమాలకు చెక్‌ 

 ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ 

 మినీ ట్రక్కుల సేవలు ప్రారంభం

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/గుజరాతీపేట, జనవరి 21 : ఇకపై నాణ్యమైన రేషన్‌ సరుకులు ఇంటి వద్దకే ప్రభుత్వం చేరవేస్తుందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. కేఆర్‌ స్టేడియంలో గురువారం నిర్వహించిన రేషన్‌ సరుకుల రవాణా వాహనాల(మినీ ట్రక్కులు) ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇక నుంచి రేషన్‌ సరుకుల కోసం డిపోల వద్ద క్యూలైన్‌లో నిల్చొని అవస్థలు పడాల్సిన అవసరంలేదని తెలిపారు.  తూకంలో అక్రమాలకు అవకాశం లేకుండా ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రతి ఇంటికీ నాణ్యమైన బియ్యాన్ని వాహనాల ద్వారానే సరఫరా చేస్తామన్నారు. హమాలీ చార్జీలు, ఆయిల్‌ ఖర్చులు, డ్రైవర్లకు కలిపి నెలకు మొత్తం రూ.16 వేల వంతున చెల్లించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు 530 వాహనాలను రాయితీపై అందించినట్లు కృష్ణదాస్‌ తెలిపారు. పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. గతంలో రేషన్‌ బియ్యం నాసిరకంగా ఉండేవని చెప్పారు. ప్రస్తుతం ఆ పరిస్థితిలో పూర్తి మార్పు తీసుకు వచ్చినట్లు తెలిపారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్‌ జెండా ఊపి వాహనాల ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, కంబాల జోగులు, వి.కళావతి, గొర్లె కిరణ్‌కుమార్‌, రెడ్డి శాంతి, డీసీసీబీ చైర్మన్‌ విక్రాంత్‌, కలెక్టర్‌ నివాస్‌, జేసీలు సుమిత్‌కుమార్‌, శ్రీనివాసులు, ఎస్పీ అమిత్‌బర్దర్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-01-22T05:24:37+05:30 IST