
వాషింగ్టన్: మెక్సికో-అమెరికా సరిహద్దులో సుమారు 19 కాలిన మృతదేహాలు లభించిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రెండు కాలిపోయిన వాహనాల నుంచి సుమారు 19 మృతదేహాలను వెలికి తీసినట్టు తమౌలిపాస్ స్టేట్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దుండగులు.. 19 మందిని తుపాకీతో కాల్చి చంపి, ఆపై మృతదేహాలను వాహనాల్లో పెట్టి నిప్పుపెట్టినట్టు అధికారులు భావిస్తున్నారు. కాగా.. ఈ మృతదేహాలు లభ్యమైన ప్రాంతంలో డ్రగ్ మాఫియాకు సంబంధించిన వ్యక్తుల మధ్య తరచూ గొడవలు చేటు చేసుకుంటాయని అధికారులు తెలిపారు.