జొమాటో, పేటియం, అమెజాన్ వంటి 30వేల వెబ్‌సైట్లు డౌన్!

Jul 22 2021 @ 23:00PM

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో బాగా పాపులర్ అయిన అమెజాన్, జొమాటో, పేటియం, ప్లేస్టేషన్ నెట్‌వర్క్, ఫెడెక్స్, స్టీమ్, యూపీఎస్, ఎయిర్‌బీఎన్‌బీ, హోండిపో వంటి సుమారు 30వేల ప్రముఖ వెబ్‌సైట్లు సడెన్‌గా డౌన్ అయ్యాయి. ఇదంతా ఒక భారీ సాంకేతిక సమస్య వల్లే జరిగినట్లు సమాచారం. డొమైన్ నేమ్ వ్యవస్థ(డీఎన్ఎస్)లో వచ్చిన ఒక సమస్య వల్ల కనీసం 29వేల ప్రముఖ వెబ్‌సైట్లు, యాప్స్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. డీఎన్ఎస్ సమస్య వల్లే కొంతసేపు ఈ ప్రముఖ వెబ్‌సైట్లు, యాప్స్ అన్నీ పనిచేయలేదని సమాచారం. ఈ విషయాన్ని క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అకామై టెక్నాలజీస్(AKAM.O) వెల్లడించింది. ఈ సమస్యను తాము పరిష్కరించామని, ఈ వెబ్‌సైట్లన్నీ మళ్లీ సాధారణంగా పనిచేస్తున్నాయని తెలిపింది.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...