Brazil దేశంలో భారీవర్షాలు...44మంది మృతి

ABN , First Publish Date - 2022-05-30T18:38:28+05:30 IST

ఈశాన్య బ్రెజిల్‌లో కుండపోత వర్షాల వల్ల 44 మంది మరణించారు. భారీ వర్షాల బీభత్సం వల్ల మరో 44 మంది తప్పిపోయారని బ్రెజిల్ ప్రభుత్వం తెలిపింది....

Brazil దేశంలో భారీవర్షాలు...44మంది మృతి

బ్రసిలియా: ఈశాన్య బ్రెజిల్‌లో కుండపోత వర్షాల వల్ల 44 మంది మరణించారు. భారీ వర్షాల బీభత్సం వల్ల మరో 44 మంది తప్పిపోయారని బ్రెజిల్ ప్రభుత్వం తెలిపింది. భారీవర్షాల వల్ల మరో 25 మంది గాయపడ్డారు.భారీ విపత్తు వల్ల 3,957 మంది ఆశ్రయం కోల్పోయారని అని ప్రాంతీయ అభివృద్ధి మంత్రి డేనియల్ ఫెరీరా చెప్పారు. తీవ్రంగా దెబ్బతిన్న ఈశాన్య పెర్నాంబుకో రాష్ట్ర రాజధాని రెసిఫేలో బ్రెజిల్ మంత్రి డేనియల్ పర్యటించారు.బ్రెజిల్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడటంతోపాటు వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా బ్రెజిల్ దేశంలోని నదులు పొంగి ప్రవహించాయి. దాదాపు 1,200 మంది సిబ్బంది రెస్క్యూ పనిని ప్రారంభించారు. గత సంవత్సరం కుండపోతగా కురిసిన వర్షాల వల్ల సంభవించిన వరదల వల్ల వందలాది మంది బ్రెజిలియన్లు మరణించారు.గత నెల ప్రారంభంలో రాష్ట్రంలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరో 14 మంది మరణించారు.


Updated Date - 2022-05-30T18:38:28+05:30 IST