Kabul మసీదులో పేలుడు...66మంది మృతి

ABN , First Publish Date - 2022-04-30T12:44:55+05:30 IST

అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌ నగరంలోని మసీదులో తాజాగా శక్తివంతమైన మరో బాంబు పేలుడు సంభవించింది...

Kabul మసీదులో పేలుడు...66మంది మృతి

మరో 78 మందికి గాయాలు

కాబూల్ (అఫ్ఘానిస్థాన్): అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌ నగరంలోని మసీదులో తాజాగా శక్తివంతమైన మరో బాంబు పేలుడు సంభవించింది. కాబూల్ మసీదులో సంభవించిన పేలుడులో 66 మంది భక్తులు మరణించారు.ఈ పేలుడులో ఇప్పటివరకు 66 మృతదేహాలు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి వచ్చాయని అప్ఘాన్ అధికారులు చెప్పారు. మరో 78 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ముస్లింల పవిత్ర మాసం రమజాన్ చివరి శుక్రవారం ప్రార్థనల కోసం వందలాది మంది భక్తులు గుమిగూడటంతో ఖలీఫా అగా గుల్ జాన్ మసీదు కిక్కిరిసిపోయింది. అప్పుడే మసీదులో పేలుడు సంభవించడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.పేలుడుతో తాలిబన్ భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పేలుడుకు మూలం వెంటనే తెలియరాలేదు. ఈ పేలుడుకు బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు.


ఈ పేలుడు ఘటనపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని కాబూల్ పోలీసు చీఫ్ యొక్క ప్రతినిధి ఖలీద్ జద్రాన్ ట్వీట్ చేశారు.పేలుడు చాలా శక్తివంతమైనదని, దీనివల్ల మసీదు పైకప్పు కూలిపోయిందని జావిద్ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు.ఐక్యరాజ్యసమితి ఈ పేలుడు ఘటనను ఖండించింది.‘‘నిరంతరం అభద్రత మధ్య హింసకు గురవుతూనే ఉన్న అఫ్ఘానిస్థాన్ ప్రజలకు మరో బాధాకరమైన దెబ్బ ఈ పేలుడు ఘటన అని యూఎన్ డిప్యూటీ ప్రత్యేక ప్రతినిధి సమన్వయ మానవతావాది రమిజ్ అలక్‌బరోవ్ చెప్పారు. 


Updated Date - 2022-04-30T12:44:55+05:30 IST