19న పశు ఆరోగ్య సేవ అంబులెన్స్‌లు ప్రారంభం

Published: Sun, 15 May 2022 23:53:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
19న పశు ఆరోగ్య సేవ అంబులెన్స్‌లు ప్రారంభం సీఎం పర్యటన ఏర్పాట్లని పరిశీలిస్తున్న కలెక్టర్‌

గుంటూరు, మే 15 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఈ నెల 19వ తేదీన జరిగే డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్స్‌ల ప్రారంభోత్సవానికి విస్త్రృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన జిల్లా అధికారులతో కలిసి తాడేపల్లి వెళ్లి అక్కడ కార్యక్రమం జరిగే వేదికని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొత్తం 175 సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్స్‌లను సీఎం జెండా ఊపి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వాహనాలన్నీ ఒక క్రమపద్ధతిలో, నిర్ణీత మార్గంలో వెళ్లేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ నిధి మీన, పశుసంవర్థక శాఖ జేడీ వెంకటేశ్వర్లు, డీటీసీ మీరాప్రసాద్‌, డీఆర్‌డీఏ పీడీ హరిహరనాథ్‌, ఉద్యానశాఖ డీడీ సుజాత, డ్వామా పీడీ యుగంధర్‌కుమార్‌ పాల్గొన్నారు. 

 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.