రైతుబజారులో కిలో టమోటా రూ.60

ABN , First Publish Date - 2021-11-27T07:32:56+05:30 IST

తిరుపతి నగరం ఆర్సీ రోడ్డులోని రైతుబజారులో శుక్రవారం కిలో టమోటాను రూ.60 చొప్పున పంపిణీ చేశారు.

రైతుబజారులో కిలో టమోటా రూ.60

తిరుపతి(ఆటోనగర్‌), నవంబరు 26: తిరుపతి నగరం ఆర్సీ రోడ్డులోని రైతుబజారులో శుక్రవారం కిలో టమోటాను రూ.60 చొప్పున పంపిణీ చేశారు. మార్కెట్‌లో రూ.వందకుపైగా ఉండటంతో ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ధర తగ్గించి మార్కెట్‌ కమిటీ ద్వారా విక్రయాలు జరిపిందని రైతు బజార్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ దుష్యంత్‌కుమార్‌ తెలిపారు. తిరుపతి రైతు బజార్‌కు 610 ట్రేల టమోటాలు  వచ్చాయన్నారు. మిగిలిన టమోటాలను శనివారం కూడా ఇదే ధరకు విక్రయిస్తామన్నారు. 

Updated Date - 2021-11-27T07:32:56+05:30 IST