'ఆటా' నాదం.. ఆన్‌లైన్ పాటల పోటీలు..

ABN , First Publish Date - 2021-09-09T19:17:33+05:30 IST

అమెరికా తెలుగు సంఘం(ఆటా) 'నాదం' పేరిట ఆన్‌లైన్ వేదికగా పాట పోటీలు నిర్వహిస్తోంది.

'ఆటా' నాదం.. ఆన్‌లైన్ పాటల పోటీలు..

మెరికా తెలుగు సంఘం(ఆటా) 'నాదం' పేరిట ఆన్‌లైన్ వేదికగా పాట పోటీలు నిర్వహిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 14 నుంచి 26 ఏళ్ల వయసు గల వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 30లోపు www.tinyurl.com/atanadam2021 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 14 వరకు ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 8.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఆన్‌లైన్(జూమ్)లో ప్రీలిమినరీ, సెమీ ఫైనల్, ఫైనల్ రౌండ్స్ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు జడ్జీలుగా ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు కోటి, గాయని విజయలక్ష్మీ, సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నిహాల్ కొండూరి, ప్లేబాక్ సింగర్ నూతన్ మోహన్ వ్యవహరిస్తారు. 


ఈ ఆన్‌లైన్ పోటీల్లో విజేతగా నిలిచిన వారిని అవార్డుతో పాటు రవీంద్ర భారతిలో జరిగే ఆటా గ్రాండ్ ఫినాలేలో పాడే అవకాశం కల్పిస్తారు. ఇతర వివరాల కోసం ఈ-మెయిల్: atanadam2021@gmail.comలో చూడాల్సిందిగా ఆటా ప్రెసిడెంట్ భువనేష్ బూజాలా, ప్రెసిడెంట్ ఎలక్ట్ మధు బొమ్మినేని తెలిపారు. కాగా, ఆటా నాదం కొఆర్డినేటర్లుగా.. ఆటా జాయింట్ సెక్రెటరీ రామక్రిష్ణ రెడ్డి ఆలా, బోర్డు ట్రస్టీలు అనిల్ బొడ్డిరెడ్డి, శారద సింగిరెడ్డి వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమం మీడియా స్పాన్సర్స్‌గా మన టీవీ, టీవీ5, టీవీ9, యోయోటీవీ వ్యవహరిస్తున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. 

ఫేస్‌బుక్: http//www.facebook.com/americanTeluguAssociation

యూట్యూబ్: http//www.youtube.com/c/ATATV1   



Updated Date - 2021-09-09T19:17:33+05:30 IST