ATA: 'ఆటా' ఆధ్వర్యంలో విస్కాన్సిన్‌లో మిల్వాకీ టీం ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-15T12:55:52+05:30 IST

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) వారి ఆధ్వర్యంలో విస్కాన్సిన్ రాష్ట్రంలో ఆటా మిల్వాకీ టీం సెప్టెంబర్ ఈ నెల 10వ తారీఖున (శనివారం) ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల చేతుల మీదుగా ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు.

ATA: 'ఆటా' ఆధ్వర్యంలో విస్కాన్సిన్‌లో మిల్వాకీ టీం ప్రారంభం

విస్కాన్సిన్‌: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) వారి ఆధ్వర్యంలో విస్కాన్సిన్ రాష్ట్రంలో ఆటా మిల్వాకీ టీం సెప్టెంబర్ ఈ నెల 10వ తారీఖున (శనివారం) ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల చేతుల మీదుగా ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. మంగళవాద్యాలతో ఆహ్వానం పలికి ఆటా టీం సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సాండ్ వాలీ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. 12కు పైగా వాలీ బాల్ టీమ్స్ పాల్గొన్నాయి. ఈ టోర్నీలో లెవెల్-1లో NB కింగ్స్ టీం విజేతలుగా నిలిస్తే.. వైకింగ్ వారియర్స్ టీం రన్నరప్‌గా నిలిచారు. ఇక లెవెల్-2 విన్నర్స్‌గా NB రైడర్స్, రన్నర్స్‌గా NB గల్లీ బాయ్స్ నిలిచారు.  


మేళ తాళాలతో ఎంతో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. న్యూ బెర్లిన్ తెలుగు వారు ఇంటిలో వండిన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు ౩౦౦ మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. మహిళలు పిల్లలు సందడి చేశారు.  


ఆటా అధ్యక్షుడు భువనేశ్ బుజాల మాట్లాడుతూ.. ఆటా కార్యక్రమాల గురించి వివరించారు. మహిళలు సమాజ సేవలో విరివిగా పాల్గొనాలి అని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఆటా మిల్వాకీ టీం ఏర్పాటుకు చురుకైన పాత్ర పోషించిన చంద్రమౌళి సరస్వతి రీజినల్ కోఆర్డినేటర్‌గా, పోలిరెడ్డి గంట రీజినల్ డైరెక్టర్‌గా నియమించారు. ఆటా సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల, ఆటా కోశాధికారి సాయినాథ్ రెడ్డి బోయపల్లి, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీ మెహెర్ మేడవరం మిల్వాకీ టీం ఏర్పాటుకు సహకారం అందించారు. 


చంద్ర మౌళి ఆటా చికాగో టీం సభ్యులకు ఈ కార్యక్రమం నిర్వహించటానికి ప్రోత్సాహం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పోలిరెడ్డి మాట్లాడుతూ ఆటా కార్యవర్గానికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని ప్రకటించారు. పోలిరెడ్డి సహచర సభ్యులు  కరుణాకర్ రెడ్డి దాసరి, వెంకట్ చిగురుపాటి, దుర్గ ప్రసాద్ రబ్బ, వంశి ఎదపై, శ్రీకాంత్ కురుమద్దాలి, జగదీశ్ కట్ట, వినోద్ కుమార్ కాచినేని, అనిల్ వెంకటప్పాగారి, జయంత్ పర, లక్ష్మి రెడ్డి పెద్దగోర్ల, గంగాధర్ నల్లూరి, గోపాల బలిపురా, నారాయణస్వామి, ఫణి గారపాటి, శరత్ పువ్వాడి, లక్సమం ప్రసాద్ జయంత్, సత్య జగదీశ్ బాదాం, చంద్ర శేఖర్ ఈ కార్యక్రమం నిర్వహించటంలో సహకారం అందించారు.







Updated Date - 2022-09-15T12:55:52+05:30 IST