5-11ఏళ్ల పిల్లలకు కొవిడ్ టీకా.. ఖతార్ కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2022-01-31T17:26:20+05:30 IST

దక్షిణాఫ్రికా‌లో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్.. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సహా ఇతర దేశాల్లోనూ ప్రజలు కొవిడ్ బారినపడుతున్నారు. ఖతార్‌లో సైతం కొవిడ్ కేసులు

5-11ఏళ్ల పిల్లలకు కొవిడ్ టీకా.. ఖతార్ కీలక నిర్ణయం!

ఎన్నారై డెస్క్: దక్షిణాఫ్రికా‌లో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్.. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సహా ఇతర దేశాల్లోనూ ప్రజలు కొవిడ్ బారినపడుతున్నారు. ఖతార్‌లో సైతం కొవిడ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నపిల్లల కొవిడ్ టీకాపై ఖతార్ ముందడుగు వేసింది. 5-11ఏళ్ల వయసు పిల్లల కోసం ఫైజర్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌కు ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర వినియోగం కోసం ఫైజర్ టీకాకు ఆమోదం తెలిపినట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా.. బహ్రెయిన్, సౌదీ అరేబియాలు గత ఏడాది నవంబర్‌లో ఫైజర్ టీకాకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జాన్స్ హాప్కిన్క్ యూనివర్సిటీ తెలిపిన వివరాల ప్రకారం ఖతార్‌లో కరోనా బారినపడిన వారి సంఖ్య 3.36లక్షలకు చేరింది. 




Updated Date - 2022-01-31T17:26:20+05:30 IST