అమరావతి: అయ్యన్న ఇంటి గోడను కూల్చడం దారుణమని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను వదిలిపెట్టమన్నారు. అవినీతిని ప్రశ్నించినందుకే జగన్రెడ్డి కక్షసాధింపుకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బలహీన వర్గానికి చెందిన అయ్యన్న కుటుంబంపై అమానుషంగా ప్రవర్తించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడను కూల్చే నిమిషం ముందు నోటీస్ ఇవ్వడంపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి