Advertisement

గోవా అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతున్న హీరో..!

Oct 17 2020 @ 11:33AM

దివంగత సీనియర్‌ తమిళనటుడు మురళి తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన హీరో అథర్వ మురళి తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ యువ హీరో త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని సినీ వర్గాల్లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. గత కొంతకాలంగా అథర్వమురళి గోవాకు చెందిన అమ్మాయితో రిలేషన్‌ షిప్‌లో ఉన్నాడు. ఇటీవలే అథర్వ మురళి తమ్ముడు ఆకాశ్‌ పెళ్లి జరిగింది. ఇదే క్రమంలో మురళి త్వరలోనే తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడని టాక్‌. సినిమాల విషయానికి వస్తే తమిళ హీరో అయిన అథర్వమురళి 'గద్దలకొండ గణేష్‌' చిత్రంలో వరుణ్‌తేజ్‌తో కలిసి నటించాడు. 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.