Advertisement

పోలీసు పహారాలో ఏటిగడ్డకిష్టాపూర్‌!

Mar 6 2021 @ 00:18AM
ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామంలోకి వెళ్లకుండా పహారా కాస్తున్న పోలీసులు

 ఊరి నుంచి  గ్రామస్తులు బయటకు రాకుండా అడ్డగింత 

 భయాందోళనలో నిర్వాసిత గ్రామాల ప్రజలు

 కొనసాగుతున్న మల్లన్నసాగర్‌ కట్టపనులు


తొగుట, మార్చి 5 : మల్లన్నసాగర్‌ ముంపుగ్రామమైన సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్‌ పోలీసు పహారాలో కొనసాగుతున్నది. గ్రామంలోని నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌తోపాటు పూర్తిపరిహారం ఇవ్వకుండా, ఇళ్లు ఖాళీ చేయకముందే గ్రామానికి వెళ్లే రహదారిని మూసేసి మల్లన్నసాగర్‌ కట్ట నిర్మాణం చేపట్టారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితలు చోటుచేసుకున్నాయి. నిర్వాసితులకు మద్దతుగా కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు రెండు రోజుల వ్యవధిలో వేర్వేరుగా ఏటిగడ్డ కిష్టాపూర్‌ చేరుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. పోలీసులు ముందస్తుగానే గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా గట్టిబందోబస్తు చర్యలు చేపట్టారు. గ్రామం నుంచిఎవరినీ బయటకు వెళ్లనివ్వకుండా, బయటివారిని లోపలికి రానివ్వకుండా చర్యలు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా వెళ్లాల్సి వస్తే వారి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఎందుకు వెళ్తున్నారో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే పోలీసులు అనుమతిస్తున్నారు. నిర్వాసిత గ్రామ ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గ్రామానికి వెళ్లే రహదారిని పూర్తిగా మూసివేసి కాంట్రాక్టర్లు పోలీస్‌ పహారాలో మల్లన్నసాగర్‌ కట్ట పనులను వేగవంతం చేశారు.


దారికాచి దొంగల్లా అక్రమ అరెస్టులా?

 దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు 

తొగుట, మార్చి 5 : ‘‘దొంగల్లాగా దారికాచి అక్రమ అరెస్టులు చేస్తారా? తొగుటలో పోలీసులతో ప్రశ్నించే గొంతును నొక్కొచ్చు. అసెంబ్లీలో మాత్రం ప్రశ్నించే గొంతును నొక్కలేరు’’ అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. శుక్రవారం ఉదయం మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన తొగుట ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామనిర్వాసితులను కలవడానికి వెళ్తుండగా వెంకట్రావ్‌పేట గ్రామ శివారులో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కొద్దిసేపు అక్కడ హైడ్రామా కొనసాగింది. తన నియోజకవర్గంలో పర్యటిస్తే అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అయినా కూడా పోలీసులు వినిపించుకోకుండా అరెస్టు చేసి చేర్యాల పోలీసుస్టేషన్‌కు తరలిస్తుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. తొగుటలో చీకటి ప్రజాస్వామ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే అడ్డుకుని అరెస్టు చేయడం దారుణమన్నారు. కలెక్టర్‌కు, ఎంపీ, ఎమ్మెల్యేకు కానీ నిర్వాసితుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే మల్లన్నసాగర్‌ కట్ట మీదికి వారికి రక్షణగా వెయ్యి మంది పోలీసులను తీసుకుని రండి తాను ఒక్కడినే వస్తా అని సవాల్‌ విసిరారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌ నియోజకవర్గ నిర్వాసితులకు ఒక న్యాయం దుబ్బాక ప్రజలకు ఒక న్యాయమా? అని ఘాటుగా విమర్శించారు. రెండు, మూడు రోజుల్లో ముంపు గ్రామాల పర్యటనపై కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

చేర్యాల: మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపబోమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్‌రావు స్పష్టం చేశారు. ఏటిగడ్డ కిష్టాపూర్‌ వెళ్తున్న ఆయనను పోలీసులు అరెస్టు చేసి చేర్యాల పోలీ్‌సస్టేషన్‌కు తీసుకొచ్చారు.  ఠాణా ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభు త్వం మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు అన్యాయం చేస్తుంద న్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు వెనకడుగు వేయబోమని తెలిపారు. ఆయన వెంట బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్య దర్శి బూరుగు సురేశ్‌, నాయకులు అంకుగారి శశిదర్‌రెడ్డి, కాశెట్టి పాండు ఉన్నారు. 

Follow Us on:
Advertisement