ఏటీఎం మోసగాడు అరెస్టు

ABN , First Publish Date - 2021-03-02T05:56:02+05:30 IST

ఏటీఎంల వద్ద అమాయకులు, నిరక్షరాస్యులను ఏమార్చి డబ్బు కాజేసే మోసగాడిని పీలేరు పోలీసులు అరెస్టు చేశారు.

ఏటీఎం మోసగాడు అరెస్టు
ఏటీఎం మోసగాడు మంజునాధను అరెస్టు చూపుతున్న ఎస్‌ఐ శివకుమార్‌

పీలేరు, మార్చి1 : ఏటీఎంల వద్ద అమాయకులు, నిరక్షరాస్యులను ఏమార్చి డబ్బు కాజేసే మోసగాడిని పీలేరు పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ శివకుమార్‌ కథనం మేరకు.. శాంతిపురం మండలం బేడంపల్లెకు చెందిన మంజునాథ ఏటీఎంల వద్ద నగదును డ్రా చేసుకోవడానికి వచ్చేవారికి సహాయపడేలా నటించేవాడు. కార్డు పనిచేయడం లేదని, ఏటీఎంలో డబ్బు లేదని రకరకాల సాకులతో వినియోగదారుల ఏటీఎం కార్డులను తీసుకుని నకిలీ ఏటీఎం కార్డులను వారికి ఇచ్చి ఉడాయించేవాడు. ఆ తర్వాత నగదు డ్రా చేసుకునేవాడు. ఈ మోసాలపై పీలేరులో తరచూ ఫిర్యాదులు వస్తుండడంతో స్థానిక క్రాస్‌ రోడ్డులోని ఏటీఎంల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏటీఎం వద్ద వృద్ధులను మభ్యపెడుతుండగా పట్టుకున్నారు. విచారణలో నేరం అంగీకరించాడు. అతడి నుంచి ద్విచక్రవాహనం, రూ. 37వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-03-02T05:56:02+05:30 IST