ఆత్మకూరు బరిలో ఎంతమంది అంటే..

ABN , First Publish Date - 2022-06-10T00:47:07+05:30 IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు గురువారం నామినేషన్‌ ఉపసంహరణ ఘట్టం ముగిసింది. చివరిరోజు

ఆత్మకూరు బరిలో ఎంతమంది అంటే..

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు గురువారం నామినేషన్‌ ఉపసంహరణ ఘట్టం ముగిసింది. చివరిరోజు ఇండిపెండెంట్‌ అభ్యర్థి బొర్రా సుబ్బారెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.కాగా ఉప ఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు తలపడుతున్నారు.  ఈ మేరకు అభ్యర్థుల పేర్లను రిటర్నింగ్‌ అధికారి హరేందిర ప్రసాద్‌ ప్రకటించారు. శుక్రవారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది. ఈ నెల 23వ తేదీన ఉప ఎన్నిక జరగనున్నది. ఈనెల 26వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

 

బరిలో నిలిచిన అభ్యర్థులు

1 మేకపాటి విక్రమ్‌రెడ్డి -  వైసీపీ  

2 గుండ్లవల్లి భరత్‌కుమార్‌ - బీజేపీ 

3 నందా ఓబులేశు  -       బీఎస్పీ 

4 షేక్‌ జలీల్‌ -     నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ

5 షేక్‌ మొయినుద్దీన్‌ -   ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌

6 బండారు రవి -   హర్ధమ్‌ మన్వట్వాడి రాష్ట్రీయ దళ్‌

7 బూరుగ రత్నం  -        ఇండిపెండెంట్‌ 

8 చల్లా పెంచలమోహన్‌రెడ్డి   - ఇండిపెండెంట్‌

9  పెనాకా అమర్‌నాథ్‌రెడ్డి     - ఇండిపెండెంట్‌

10 పెయ్యల హజరత్తయ్య      - జనంమనం పార్టీ

11 రావులకొల్లు మాలకొండయ్య -  ఇండిపెండెంట్‌ 

12  షేక్‌ మహబూబ్‌బాష    - అన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ

13 తూమాటి శశిధర్‌రెడ్డి    -  ఇండిపెండెంట్‌ 

14 లాలి వెంకటయ్య       -  ఇండిపెండెంట్‌ 

Updated Date - 2022-06-10T00:47:07+05:30 IST