దిష్టిబొమ్మల్లా ఏటీఎంలు

ABN , First Publish Date - 2021-01-11T06:33:05+05:30 IST

జిల్లాలో ఏటీఎంల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో అవి దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. అత్యవసర సమయం లో చేతిలో కార్డు పట్టుకుని ఏటీఎంకు వెళ్తే అంతే సం గతులు. అనంతపురం నగరంలోనే చాలా ఏటీఎంలు పని చేయని దుస్థితి.

దిష్టిబొమ్మల్లా ఏటీఎంలు

నమ్ముకుని వెళితే అందని డబ్బు

నగదు రాదు.. బ్యాంకర్లు స్పందించరు

ఇబ్బందిపడుతున్న ఖాతాదారులు

అనంతపురం క్లాక్‌టవర్‌, జనవరి 10: జిల్లాలో ఏటీఎంల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో అవి దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. అత్యవసర సమయం లో చేతిలో కార్డు పట్టుకుని ఏటీఎంకు వెళ్తే అంతే సం గతులు. అనంతపురం నగరంలోనే చాలా ఏటీఎంలు పని చేయని దుస్థితి. ఉదాహరణకు...నగరంలోని అశోక్‌నగర్‌లో ఉన్న ఆంధ్రాబ్యాంకు  ఏటీఎం గత మూడు నెలలుగా మూతపడి ఉంది. సంబంధిత బ్యాంకర్లను అడిగితే యూనియన్‌బ్యాంకులోకి విలీనం చేశారు...సా్‌ఫ్టవేర్‌ అప్‌డేట్‌ చేస్తున్నారని చెబుతున్నారు. విద్యుత్తునగర్‌-హౌసింగ్‌బోర్డు ప్రధాన రహదారిలో మూడు ఎస్‌బీఐ ఏటీఎంలు ఉన్నాయి. ఈ ఏటీఎంలు తెరుచుకునే ఉంటాయి. అయి తే నగదు మాత్రం ఉండదు. గత ఆరునెలలుగా ఈ ఎటీ ఎంలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. నగదు లేకుం డా ఈ ఏటీఎంలు ఎందుకు ఉంచారని ఖాతాదారులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి దుస్థితి ఉంటే ఇక సెమీఅర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఎంతదయనీయంగా ఉంటుందో అర్థమవుతుంది. ఇదివరకు ఏటీఎంల నిర్వహణ మొత్తం ఏజెన్సీలకు అప్పగించేవారు. ప్రస్తుతం సంబంధిత బ్యాంకులే ఏటీఎంల నిర్వహణ చూసుకుంటున్నారు. దీంతో వాటి నిర్వహణ గతంలోకంటే దయనీయంగా మారింది. 


ప్రజలపై మాత్రం చార్జీలు బాదుడే...

ఏటీఎంలు సరిగా పనిచేయడం లేదు కదా అని ఖాతాదారులు వదిలేశారు. అయితే ఏటీఎం కార్డుదారులను మాత్రం ఆయా బ్యాంకులు సర్వీ్‌సచార్జీల పేరుతో బాదే స్తున్నాయి. ప్రజలు ఏటీఎంలు ఉపయోగించకపోయినా ప్రజల బ్యాంకు ఖాతాల్లో నుంచే చార్జీలు వసూలు చేసుకుంటున్నారు. పనిచేయని ఏటీఎంలకు ఎందుకు చార్జీలు కట్టాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏటీఎం కార్డు ద్వారా ఖాతాకలిగిన బ్యాంకు నుంచి కాకుండా ఇతర బ్యాంకుల్లో నెలకు మూడు సార్లుకు పైగా లావాదేవీలు చేస్తే అదనంగా రూ.20వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు.  దీనిపై ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


జిల్లాలో 609 ఏటీఎంలు...అందులో సగానికి పైగా దిష్టిబొమ్మలే...

జిల్లాలో వివిధ బ్యాంకులకు సంబంధించి 609 ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో గత మార్చి నుంచి సగానికి పైగా ఏటీఎంలలో నగదు లేకుండా దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని ఏటీఎంలు మూసివేశారు. ఇందులో ఆంధ్రాబ్యాంకు 34, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు 28, ఎస్‌బీఐ 265, యాక్సి్‌సబ్యాంకు 33, బ్యాంకు ఆఫ్‌ బరోడా 16, బ్యాంకు ఆఫ్‌ ఇండియా 2, కెనరాబ్యాంకు 72, సెంట్రల్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా 1, సిటీయూనియన్‌ బ్యాంకు 9, కార్పొరేషన్‌ బ్యాంకు 14, ఏడీసీసీ బ్యాంకు 21, హెచ్‌డీఎ్‌ఫసీ 19, ఐసీఐసీఐ 18, ఐడీబీఐ 11, ఇండియన్‌ బ్యాంకు 11, ఐఓబీ 6, ఇండ్‌సఇండ్‌బ్యాంకు 1, కోటక్‌మహేంద్రబ్యాంకు 7, కర్ణాటక బ్యాంకు 17, కరూర్‌వైశ్యాబ్యాంకు 14, లక్ష్మివిలా్‌సబ్యాంకు 2, పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు 3, యుకోబ్యాంకు 1, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా 4లు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 92, సెమీ అర్బన్‌లో 186, అర్బన్‌లో 331ఏటీఎంలు ఉన్నాయి. 


ఆయా బ్యాంకులకు నివేదించాం

ఏటీఎంలలో అక్కడక్కడ నగ దు లేకుండా ఓపెన్‌లో ఉన్నమాట వాస్తవమే. ఇప్పటికే ఈ పరిస్థితులపై  సంబం ధిత బ్యాంకులకు నివేదిం చాం. ప్రజల నుంచి అనేక వినతులు, ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజల అభిప్రా యాలు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఏటీఎంలలో నగదు ఉంచాలని అధికారులకు సూ చిం చాం. నగదు ఉంచలేని పరిస్థితుల్లో ఆయా ఏటీఎంలను మూసివేయడం మంచిదని వివరించాం.  బ్యాం కుల విలీనంతో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌, ఇతరత్ర పనుల వలన కొద్దిగా ఏటీఎంలు పూర్తిస్థాయిలో అం దుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రజలు దీనికి సహకరించాలి. 

- మోహన్‌మురళీ, ఎల్‌డీఎం



Updated Date - 2021-01-11T06:33:05+05:30 IST