నేడు పోస్టల్‌ బ్యాలెట్‌

ABN , First Publish Date - 2021-03-07T07:19:03+05:30 IST

ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్ర భుత్వోద్యోగులు ఆదివారం పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోనున్నారు.

నేడు పోస్టల్‌ బ్యాలెట్‌
నగరంలో బలగాల కవాతు...

అనంతపురం కార్పొరేషన్‌, మార్చి6: ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్ర భుత్వోద్యోగులు ఆదివారం పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోనున్నారు. మున్సిపల్‌ ఎన్నికలు ఈనెల 10వ తేదీన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వోద్యోగులకు ఆదివారం పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించారు. అనంతపురం నగర పాలక సంస్థకు సంబంధించి నగరంలోని ఎస్‌ఎ్‌సబీఎన్‌ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. మిగతా మున్సి పాలిటీలు, నగర పంచాయతీల్లో నిర్దేశించిన కేంద్రాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవచ్చు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ పొందవచ్చు.


మున్సిపోల్స్‌కు పటిష్ట భద్రత

పోలింగ్‌, కౌంటింగ్‌పై ప్రత్యేక నిఘా.. జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు

అనంతపురం క్రైం, మార్చి 6: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ సత్యయేసుబాబు శనివారం ప్రకటనలో తెలిపారు. అనంతపురం నగర పాలక సంస్థతో పాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లో నిర్వహించే ఎన్నికలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల వారీగా భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. పోలింగ్‌, కౌంటింగ్‌ తేదీల్లో నిఘా పెంచుతామన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌లు, పోలింగ్‌ కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, తగిన భద్రత ఏర్పాటు చేశామని వెల్లడించారు. అక్రమమద్యం, నాటుసారా సరఫరా కాకుండా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని ఆయా ప్రాంతాల పోలీసులకు దిశానిర్దేశం చే శామన్నారు. ట్రబుల్‌ మాంగర్స్‌, పాత నేరస్థులు, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే తక్షణమే డయల్‌-100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.


Updated Date - 2021-03-07T07:19:03+05:30 IST