కొత్తగా 10 కరోనా కేసులు - ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-03-06T06:58:08+05:30 IST

జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. గత కొంతకాలం కేసులు పూర్తి స్తాయిలో తగ్గుతూ వచ్చాయి.

కొత్తగా 10 కరోనా కేసులు - ఒకరు మృతి

అనంతపురం వైద్యం, మార్చి 5: జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. గత కొంతకాలం కేసులు పూర్తి స్తాయిలో తగ్గుతూ వచ్చాయి. మరణాలు కూడా చాలా రోజులుగా జిల్లాలో నమోదుకాలేదు. అయితే గత మూడు నాలుగు రోజులుగా కొత్తగా క రోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 10 కొత్త కరో నా కేసులు నమోదైనట్టు శుక్రవారం వెల్లడించారు. చాలా రోజుల తర్వాత కరోనా వైరస్‌ కు మరొకరు బలయ్యారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 600కి పెరిగింది.  ఇప్పటివరకు 67795 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 67141 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం 54 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.  


కరోనా టీకా కేంద్రాల పెంపు

అనంతపురం వైద్యం, మార్చి 5 : జిల్లాలో కొవిడ్‌ టీకా కేంద్రాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించ డంతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు 40 కేంద్రాల్లో కరోనా టీకా వేస్తువస్తున్నారు. ప్రభు త్వ ఆదేశాలు మేరకు జిల్లాలో టీకా కేంద్రాలను 120కి పెంచినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ కామేశ్వరప్రసాద్‌ శుక్రవారం వెల్లడించారు. జిల్లా సర్వజనాస్పత్రి, హిందూపు రం ప్రభుత్వాస్పత్రి, గుంతకల్లు రైల్వే ఆస్పత్రితో పాటు 51 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ ఆరోగ్య కేం ద్రాలు, 48 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా టీకా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు డీఎంహెచ్‌ఓ తెలిపారు. ప్రభుత్వాస్ప త్రిలో ఉచితంగా టీకా వేస్తారని, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వే యించుకొనే వారు రూ.250లు చెల్లించాల్సి ఉంటుందన్నా రు. ముందుగా కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకొని ఏదైన గుర్తింపు కార్డును కేంద్రాల వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంద న్నారు.  

Updated Date - 2021-03-06T06:58:08+05:30 IST