అవే అవస్థలు..!

ABN , First Publish Date - 2021-05-09T06:18:09+05:30 IST

జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో కరోనా బాధితుల అవస్థలు మాత్రం తీరట్లేదు.

అవే అవస్థలు..!
ఒకే మంచంపై ఇద్దరుముగ్గురిని ఉంచి చికిత్స అందిస్తున్న దృశ్యం

అనంతపురం వైద్యం, మే 8: జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో కరోనా బాధితుల అవస్థలు మాత్రం తీరట్లేదు. రోజూ అవే దృ ష్యాలు, ఆర్తనాదాలే. చాలినంత ఆక్సిజన్‌, బెడ్లు, సదుపాయాలు లేక కరోనా బాధితులు అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. శనివారం కూడా ఒకే బెడ్డుపై ఇద్దరు బాధితులు చికిత్స పొందుతూ కనిపించారు. కొంతమందికి నేలమీదే వైద్యం తప్పలేదు. మరికొంతమంది చెట్ల కింద తం టాలు పడుతూ కనిపించారు. ప్రభుత్వ, యం త్రాంగం వైఫల్యాలు బయటపడకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మీడియా ప్రతినిధులు ఆస్పత్రిలోకి ప్రవేశించకుండా పోలీసు పహారా ఏర్పాటు చేయటం శోచనీయం.


ఆస్పత్రిలోకి మీడియా రాకుండా ఆంక్షలు

ఏదైనా సమస్య ఉందని తెలియజేస్తే అధికారులు దాని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. జిల్లా ఆస్పత్రి కొవిడ్‌ ఓపీలో బెడ్లు లేక అనేక మంది బాధితులు నిత్యం నరకం చూస్తున్నారు. అనేక మంది అందరి కళ్లెదుటే ప్రాణాలు కోల్పోతుండగా కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఈ ఘటనలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే తగిన వసతులు కల్పించి, రోగుల బాధలు తీరుస్తారని ‘ఆంధ్రజ్యోతి’ కొన్ని రోజులుగా విశ్లేషణాత్మక కథనాలు ప్రచురిస్తూ వచ్చింది. అధికారులు ఆస్పత్రిలో కొవిడ్‌ బాధితులకు వసతులు కల్పించకపోగా నియంత ఆలోచన చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఓపీలో కొవిడ్‌ బాధితుల క ష్టాలు బయటకు తెలియకుండా ఉంచేందుకు మీడియాకు ఆంక్షలు విధించారు. శనివారం ఆ స్పత్రి కొవిడ్‌ ఓపీ వద్దకు మీడియాకు నో ఎంట్రీ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక పోలీసులు, సెక్యూరిటీ గార్డ్‌లను ఏర్పాటు చేసి, మీడియా ప్రతినిధులు ఎవరినీ లోపలకు పంపకుండా అడ్డుకొని వెనక్కి పంపించారు. నేరుగా డీఎస్పీ వీరరాఘవరెడ్డి అక్కడికి చేరుకుని, మీడియాకు అనుమతి లేదనీ, ఏదైనా కావాలంటే కలెక్టర్‌, జేసీల అనుమతి తీసుకొస్తే పంపిస్తామని చెప్పి మీడియా వాళ్లను వెనక్కు పంపించారు. ఎస్‌ఐ, సీఐలు సైతం ఇలాగే చెబుతూ మీడియా కు అనుమతి ఇవ్వలేదు. కొవిడ్‌ ఓపీలో మెరుగైన వసతులు కల్పించడంపై మాత్రం అధికారులు శ్రద్ధ చూపలేదు. శనివారం కూడా కరోనా బాధితులతో ఓపీ కేంద్రం కిటకిటలాడింది. మంచాలు లేక ఒక్కో మంచంపై ఇద్దరుముగ్గురిని ఉంచి, చికిత్సతో పాటు ఆక్సిజన్‌ ఒక్కోసారి ఒక్కొక్కరికి కొంతసేపు అందిస్తూ వైద్యులు కనిపించారు. చాలామందికి మంచాలు లేక గంటల తరబడి పడిగాపులు కాస్తూ.. నేలపైనే కూర్చొని అనేక ఇబ్బందులు పడుతూ కనిపించారు. ఏది ఏమైనా కరోనా బాధితుల కష్టాలు బయటకు తెలియకుండా ఉండాలని మీడియాకు ఆంక్షలు పెట్టడంపై అధికారుల తీరును ప్రజలు తప్పుపడుతున్నారు. ఇలాంటి నియంత పోకడలపై బాధితులు మరింత మండిపడుతున్నారు.





ఆగని కరోనా ఉధృతి

కొత్తగా 1741 మందికి పాజిటివ్‌

మరో 10 మంది బలి

అనంతపురం వైద్యం, మే 8: జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొత్త కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 1741 మంది కరోనా బారిన పడినట్టు అధికారులు శనివారం వెల్లడించారు. ఈ కరోనా మహమ్మారికి మరో 10 మంది ప్రాణాలు కోల్పోయా రు. ఇప్పటివరకు జిల్లాలో 96738 మంది కరోనా బారిన పడగా.. అందులో 81981 మం ది ఆరోగ్యంగా కోలుకున్నారు. 721 మంది మరణించారు. ప్రస్తుతం 14036 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.


59 మండలాల్లో కొత్త కేసులు

జిల్లాలో 4585 శాంపిళ్లు పరీక్షలు చేయగా 1741 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇందులో అనంతపురం 387, హిందూపురం 133, తాడిపత్రి 91, కదిరి 90, పుట్టపర్తి 88, ధర్మవరం 84, పెనుకొండ 76, పరిగి 56, బొమ్మనహాళ్‌ 46, అమరాపురం 43, అమడగూరు 42, సీకేపల్లి 41, ఉరవకొండ 38, రొద్దం 35, గుత్తి 34, బ్రహ్మసముద్రం, బుక్కరాయసముద్రం 25, కనగానపల్లి, రాయదుర్గం 21, రాప్తాడు 19, ఓడీసీ, తలుపుల 18, బుక్కపట్నం 17, రామగిరి 16, గుంతకల్లు 15, డీ. హీరేహాళ్‌, గుడిబండ, పెద్దవడుగూరు 14, బత్తలపల్లి, బెళుగుప్ప, గోరంట్ల, పుటూ ్లరు, సోమందేపల్లి 13, ముదిగుబ్బ 12, శింగనమల, తనకల్లు 11, కుందుర్పి, పెద్దపప్పూరు 10, కణేకల్లు 9, గార్లదిన్నె, నల్లచెరువు, పామిడి, రొళ్ల 8, ఆత్మకూ రు 7, కంబదూరు, మడకశిర, విడపనకల్లు, కళ్యాణదుర్గం 6, నార్పల 4, కూడేరు, వజ్రకరూరు, యల్లనూరు 3, నల్లమాడ 2, చిలమత్తూరు, గాండ్లపెంట, కొత్తచెరువు, లేపాక్షి, యాడికి మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు చెందిన వారు 8 మంది, ఇతర రాష్ట్రాలకు వారు ఒకరు జిల్లాలో కరోనా బారిన పడ్డారు.



Updated Date - 2021-05-09T06:18:09+05:30 IST