వదిలేస్తారా... నియంత్రిస్తారా ?

ABN , First Publish Date - 2021-04-23T06:21:49+05:30 IST

కరోనా సెకెండ్‌వేవ్‌ కమ్ముకొస్తున్న నేపథ్యంలో ప్రజల జీవన ప్ర మాణాలు దెబ్బతినకుండా, వాణిజ్య, వ్యాపార సముదా యాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా, కరోనా నిబంధ నలు పకడ్బందీగా అమలు చేయాల్సిన జిల్లా యంత్రాం గం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.

వదిలేస్తారా... నియంత్రిస్తారా ?

వదిలేస్తారా... నియంత్రిస్తారా ?

జిల్లాలో కరోనా కరాళనృత్యం

3440కి చేరిన యాక్టివ్‌ కేసులు

తాజాగా 789 మందికి పాజిటివ్‌

బెడ్ల కొరతతో బాధితుల ఇబ్బందులు

 లెక్కల గారడీ చూపుతున్న అధికారులు

అనంతపురం,ఏప్రిల్‌22(ఆంధ్రజ్యోతి) : కరోనా సెకెండ్‌వేవ్‌ కమ్ముకొస్తున్న నేపథ్యంలో ప్రజల జీవన ప్ర మాణాలు దెబ్బతినకుండా, వాణిజ్య, వ్యాపార సముదా యాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా, కరోనా నిబంధ నలు పకడ్బందీగా అమలు చేయాల్సిన జిల్లా యంత్రాం గం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మాస్కుతో పా టు భౌతికదూరం తప్పనిసరి చేస్తూ కొన్ని జిల్లాల్లో ఆదే శాలు జారీ అయ్యాయి. జిల్లాలో కరోనా కేసులు అమాం తం పెరిగిపోతున్నా జిల్లా యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు మూటగట్టు కుంటోంది. వైరస్‌ బారిన పడకుండా ప్రజలను అప్రమ త్తం చేయడంతో పాటు వ్యాధి నిర్ధారణ పరీక్షలను పెంచా ల్సి ఉండగా ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. మా స్కు పెట్టుకోకపోతే జరిమానాలు విధిస్తామన్నారేగానీ... ఎక్కడా ఆ నిబంధనలు అమలు కావడం లేదు. బస్సులు, బహిరంగ ప్రదేశాలు, సినిమా హాళ్లు, టీ కేఫ్‌లు, రెస్టారెం ట్లు, బార్లు, దుస్తుల దుకాణాలు, బ్యాంకులు, కూరగాయల మార్కెట్లు ఇలా ఎక్కడ చూసినా జనం గుంపులుగా ఉంటున్నా వారిని నియంత్రించే నాథుడే కనిపించడం లేదు. మాస్కు పెట్టుకోకున్నా... ప్రశ్నించే వారే లేరు. ఆంక్ష లు అసలే లేవు. దీంతో ప్రజలు ఎవరికి వారు స్వేచ్ఛగా తిరుగుతూ కరోనా కాటుకు బలవుతున్నారు. 


మూడు వేలకు పైనే యాక్టివ్‌ కేసులు

జిల్లాలో సెకెండ్‌వేవ్‌ ప్రారంభంలో రెండంకెల్లోపే పాజిటివ్‌ కేసులు నమోదయ్యేవి. ఈ నెల ఆరంభం నుం చే సెకెండ్‌వేవ్‌ ఉగ్రరూపం దాల్చింది. ఈ ఏడాది మార్చి 31 వరకూ జిల్లాలో 68422 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 67495 మంది డిశ్చార్జ్‌ కాగా  602 మంది  మృతి చెందారు. ఇక మిగిలిన 325 మంది వివిధ కొవిడ్‌ ఆస్ప త్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నెలలో ఇప్పటి వరకూ అంటే... 22 రోజుల్లో 5100 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1964 మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా 21 మంది  మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం జిల్లాలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3440కి చేరింది. దీన్నిబట్టి చూస్తే జిల్లాలో కరోనా వైరస్‌ కొత్త పుంతలు తొక్కుతోంద నడంలో సందేహం లేదు. కరోనాకు అడ్డుకట్ట పడకపోతే పరిస్థితులు మరింత చేజారిపోయే అవకాశాలు ఉన్నా యని  ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా యంత్రాంగం, మరీ ముఖ్యంగా పోలీసుశాఖ సీరియ్‌సగా స్పందించకపోతే ప్రజలు మూల్యం చెల్లించుకోకతప్పదన్న వాదన మేధావి, వైద్యవర్గాల నుంచి వినిపిస్తోంది.


తాజాగా 789 మందికి పాజిటివ్‌

జిల్లాలో 789 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు గురువారం వెల్లడించారు. ఒకరు మృతి చెందారన్నారు. జిల్లాలో 63 మండలాలుండగా... 58 మండలాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయం టే జిల్లాను కరోనా చుట్టేస్తోందనడంలో ఎలాంటి సందే హం లేదు. జిల్లాకేంద్రంలో 292, ధర్మవరంలో 92, పుట్టపర్తిలో 48, హిందూపురంలో 43, గుంతకల్లులో 17, మడకశిరలో 17, పెనుకొండలో 16, కంబదూరులో 15, పరిగిలో 14, కదిరి, ఓడీ చెరువులలో 13, యాడికిలో 12, తాడిపత్రి, శింగనమలలో 11, సోమందేపల్లిలో 10, రాయ దుర్గంలో 9, అమరాపురం, అనంతపురం రూరల్‌, గుత్తి, గోరంట్ల, కొత్తచెరువు మండలాల్లో 8 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సీకేపల్లి, తలుపుల, రొళ్లలో 6 చొప్పున కేసులు నమోదు కాగా... పామిడి, రాప్తాడు, గుడి బండలలో 5 కేసులు నమోదయ్యాయి. బుక్కపట్నం, బుక్కరాయసముద్రం, నార్పల, తనకల్లు మండలాల్లో 4 కేసులు చొప్పున, అమడగూరు, చిలమత్తూరు, గాండ్లపెం ట, కుందుర్పి, ముదిగుబ్బ, పెద్దవడుగూరు, పు ట్లూరు, రామగిరి, వజ్రకరూరు, విడపనకల్లు, యల్లనూరులలో మూ డు కేసులు చొప్పున, బెళుగుప్ప, బొమ్మనహాళ్‌, డీ. హీరే హాళ్‌, కళ్యాణదుర్గం, కణేకల్లు, లే పాక్షి, నల్లచెరువు, పెద్దప ప్పూరు, రొద్దం మండలాల్లో 2 కేసులు చొప్పున నమోద య్యాయి. కూడేరు, నల్లమాడ, ఎనపీ కుంట, శెట్టూరులలో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదు కాగా... హైదరాబాదుకు సంబంధించి 2, ఇతర జిల్లాలకు సంబంధించి 7 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


మరణాల  ‘లెక్క’లేదు

జిల్లాలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్యను స్పష్టం గా వెలువరించడంలో  స్పష్టత కరువవుతోంది. రాష్ట్ర బులెటినలో ఇప్పటి వరకూ జిల్లాలో 623 మంది కరోనాతో చనిపోయినట్లు చూపుతున్నారు. జిల్లా అధికారులు ప్రక టించిన మేరకు 653 మంది చనిపోయినట్లు చెబుతు న్నారు. రాష్ట్ర బులెటినలో చూపుతున్న సంఖ్యకు, జిల్లాలో ప్రకటిస్తున్న లెక్కకు మధ్య తేడా భారీగా కనిపిస్తోంది.  దాదాపు 30 మరణాలకు లెక్కలేదన్నది రాష్ట్ర బులెటిన నివేదిక స్పష్టం చేస్తోండటం గమనార్హం. 


టెస్టింగ్‌ ఫలితం వెలువడేలోపు మృత్యువు అంచులదాకా...

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో... ఏ చిన్న లక్షణం కనిపించినా ప్రజలు పరీక్షలు చే యిం చుకునేందుకు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వైద్య సిబ్బంది వారి నుంచి శాంపి ళ్లు సేకరిస్తున్నారు. రోజుకు అధికారిక లెక్కల మేరకు 7వేల మందికిపైగా శాంపిళ్లు సేకరి స్తున్నారు. టెస్టింగ్‌లు మాత్రం అందులో 50 శాతం కూడా చేయడం లేదు. దీంతో ఫలితం వెలువరించే సమయానికి ఎవరైతే కరోనా లక్షణాల అనుమానాలతో శాంపిళ్లు ఇచ్చా రో ఆ వ్యక్తి మృత్యువు అంచులదాకా వెళ్లే పరిస్థితులు జి ల్లాలో కనిపిస్తున్నాయి. వారం రోజుల కిందట ఇచ్చిన శాం పిళ్లకు ఇప్పటి వరకూ పరీక్ష చేసి ఫలితం నిర్ధారించ లే దంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. చాలా మంది కరోనా భయంతో టెస్టింగ్‌ ఫలితం రాకపోయినా ఆస్పత్రు ల్లో చేరిపోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారు లు టెస్టింగ్‌లపై శ్రద్ధ పెట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు టెస్టింగ్‌ ఫలితాలు వెలువరించకపోతే ప్రమాదం పొంచి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా రోజురోజుకు వందల్లో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో చేరే బాధితుల సంఖ్య అదేస్థాయిలో ఉంటోంది. దీంతో ఏ ఆస్పత్రిలో చూసినా బెడ్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఆర్డీటీ ఆస్పత్రిలో 300 బెడ్లను ప్రా రంభించినప్పటికీ అంతకుమించి కరో నా బాధితులు అక్క డ చేరేందుకు క్యూ కడుతున్నారంటే బెడ్ల కొరత ఎంత ఉందో అర్థమవుతోంది. 


అన్ని ఏర్పాట్లు చేశామంటూ లెక్కల గారడీ....

జిల్లాలో కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు సి ద్ధం చేశామంటూ జిల్లా యంత్రాంగం లెక్కలు వేసిమరీ చూపిస్తోంది. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితు లు ఉన్నాయి. 24 గంటల్లో 17 ఆస్పత్రుల్లో 5420 బెడ్లు సిద్ధం చేయాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేసినా ఏ ఆస్పత్రిలోనూ ఆ మేరకు ఏర్పాట్లు చేయ లేదంటే అధికారుల్లో చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. జిల్లాలో గురువారం నాటికి 18 ఆస్పత్రుల్లో 1900 బెడ్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3440కి చేరింది. వీరిలో ఎక్కువ మంది కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందేం దుకే ఆసక్తి చూపుతున్నారు. అక్కడైతే సరైన వైద్యం అందుతుందనే అభిప్రాయం వారిలో ఉండటమే ఇందుకు కారణం. ఆ మేరకు ఏర్పాట్లు లేకపోవడంతో కరోనా బాధి తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు లెక్క ల గారడీతో సమయాన్ని వృథా చేస్తున్నారన్న విమర్శలు వివిధ వర్గాల ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఏదేమైన ప్పటికీ కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగు తున్న నేపథ్యంలో ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్య త జిల్లా యంత్రాంగంపై ఉంది. 

Updated Date - 2021-04-23T06:21:49+05:30 IST