నెలాఖరులోపు గృహనిర్మాణాల గ్రౌండింగ్‌ పూర్తి కావాలి

Jun 17 2021 @ 01:20AM
వీసీకి హాజరైన కలెక్టర్‌, ఎస్పీ, జేసీలు

జిల్లా యంత్రాంగానికి సీఎం ఆదేశం

అనంతపురం, జూన్‌16(ఆంధ్రజ్యోతి): పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మొదటి విడతలో మంజూరు చేసిన గృహాలన్నింటికి సంబంధించి నెలాఖరునాటికి గ్రౌండింగ్‌ పూర్తి కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆ మేరకు ఆయన బుధవారం తాడేపల్లిలోన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌, ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌-19, ఉపాధి హామీ పనులు, గ్రామ సచివాలయ, ఆర్‌బీకేల భవనాలు, వైఎ్‌సఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు, ఏఎంసీయూలు, బీఎంసీయూలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వైఎ్‌సఆర్‌ అర్బన్‌ క్లినిక్‌లు, పేదలందరికీ ఇళ్ల పురోగతి, ఖరీఫ్‌ సీజన్‌ సన్నద్ధత తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం.. జిల్లా యంత్రాంగానికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కరోనా మూడో దశపై ప్ర స్తుతం ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయన్నారు. అయినప్పటికీ... మూడోవేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలన్నారు. కేసులు తగ్గుముఖం పడుతున్నాయని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. రైతులకు మేలు జరగాలంటే ఈ-క్రాప్‌ బుకింగ్‌ సమర్థవంతంగా జరగాలన్నారు. కలెక్టర్‌ వ్యక్తిగతంగా ఈ-క్రాప్‌ బుకింగ్‌ను పర్యవేక్షించి, పరిస్థితిని మె రుగు పరచాలన్నారు. ఉపాధి హామీ నిధులతో చేపడుతున్న పనులు వేగంగా సాగాలన్నారు. జిల్లాలో కనీసం 2 వేల కి.మీ., పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్‌, ఇన్‌స్టిట్యూషన్‌ ప్లాంటేషన్‌ చేపట్టాలన్నారు. కరోనా తగ్గుముఖం పడుతున్నందున జగనన్న భూ హక్కు-భూరక్ష కింద సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ నాగలక్ష్మి సె ల్వరాజన్‌, ఎస్పీ సత్యఏసుబాబు, జేసీలు నిశాంత్‌కుమార్‌, డా.సిరి, నిశాంతి, గంగాధర్‌ గౌడ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్యతేజ, డీఆర్వో గాయత్రీదేవి, సీపీఓ ప్రేమ్‌చంద్‌, హౌసింగ్‌ పీడీ వెంకటేశ్వరరెడ్డి, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, పీఆర్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌ పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.