మోగిన నగారా..! గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2021-01-24T07:27:31+05:30 IST

గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ శనివారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

మోగిన నగారా..! గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌

జిల్లాలో నాలుగు విడతల్లో నిర్వహణ

కొనసాగుతున్న ఉత్కంఠ

సుప్రీంకోర్టు తీర్పే శిరోధార్యం

అనంతపురం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ శనివారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రెవెన్యూ డివిజన్ల వారీగా నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈనెల 25న పంచాయతీ సంగ్రామం ప్రారంభమై, ఫిబ్రవరి 17తో ముగియనుంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. రాష్ట్రస్థాయి ఉద్యోగ సంఘాల నాయకుల నుంచి అదేస్థాయిలో ధిక్కార స్వరం వినిపిస్తోంది. దీంతో ఎన్నికలు జరుగుతాయా..? లేదా...? అన్న ఉత్కంఠ అన్ని వర్గాల్లో ఉంది. ఈ ఉత్కంఠ వీడాలంటే సోమవారం దాకా ఆగాల్సిందే. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దానిని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీంకోర్టు పంచాయతీ ఎన్నికలపై తీర్పు వెలువరించనుంది. దీన్నిబట్టి చూస్తే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు తీర్పు శిరోధార్యంగా కనిపిస్తోంది.


పెనుకొండ నుంచే శ్రీకారం

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత పెనుకొండ రెవెన్యూ డివిజన్‌లోని 13 మండలాల పరిధిలోని 184 పంచాయతీలకు నిర్వహించనున్నారు. 2019 ఓటరు జాబితా ప్రకారం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇందులో ఎస్సీలకు 35, ఎస్టీలకు 7, బీసీలకు 50, అన్‌ రిజర్వ్‌డ్‌కు 92 పంచాయతీ సర్పంచ్‌ స్థానాలను కేటాయించారు. మొత్తంగా పెనుకొండ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పంచాయతీ ఎన్నికల్లో 4,99,359 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలి విడత ఎన్నికలు జరిగే పెనుకొండ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు పోటీచేసే అభ్యర్థులు ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణకు గడువు విధించారు. 28న నామినేషన్లు పరిశీలిస్తారు. 31న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఫిబ్రవరి 5న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ పోలింగ్‌ ఉం టుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు శ్రీకారం చుడతారు. అదేరోజు విజేతను ప్రకటించటంతో పాటు ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తారు. దీంతో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి.


సై అంటున్న ప్రతిపక్షాలు..

మేకపోతు గాంభీర్యంలో పాలక పార్టీ

గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు నోటిఫికేషన్‌ జారీ కావటంతో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను ఎదుర్కొనేందుకు సై అంటున్నాయి. ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని ఆ పార్టీలు స్వాగతిస్తున్నాయి. నోటిఫికేషన్‌ జా రీ అయిన నేపథ్యంలో తమ పార్టీ మద్దతుదారులను రంగంలోకి దింపేందుకు సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో సమాలోచనలు చేస్తున్నారు. పాలక పార్టీ వైసీపీ మాత్రం ఈ ఎన్నికలపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండటంతో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ఆ పార్టీ మద్దతుదారులు ఉవ్విల్లూరుతున్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ధిక్కార స్వరం వినిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఎన్నికలు నిర్వహిస్తే మంచిదనే అభిప్రాయం ఆ వర్గాల నుంచి కూడా వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ పల్లెపోరు ప్రతిపక్షాల్లో జోష్‌ నింపుతుండగా.. అధికార పక్షంలో తీవ్ర నిర్వేదాన్ని నింపుతోందనటంలో సందేహం లేదు.


ఉద్యోగుల్లో కనిపించని వ్యతిరేకత

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గుట్టుగా ఏర్పాట్లు సాగిపోతున్నాయి. అంటే దీన్నిబట్టి చూస్తే ఎన్నికలపై ఉద్యోగుల్లో వ్యతిరేకత లేదన్నది స్పష్టంగా కని పిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయి న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వస్తుందన్నది నిర్వివాదాంశం. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయకపోగా.. ఎన్నికల కమిషన్‌కు ఉన్నతస్థాయి అధికారులంతా దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమే్‌షకుమార్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్‌గానీ ఇతర సంబంధిత అధికారులుగానీ హా జరుకాలేదు. ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి నుంచి స్పష్టమైన ఆదేశాలు అందకపోవటంతోపా టు సాంకేతిక కారణాలను సాకుగా చూ పి వీసీకి హాజరుకాలేదన్నది తెలుస్తోం ది. సుప్రీంకోర్టు తీర్పు ఎన్నికల కమిషన్‌కు అనుకూలంగా వచ్చినట్లయితే ఎన్నికలు ని ర్వహించాల్సి వస్తుందనే ముందు చూపుతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను చక్కబెడుతున్నారు. ఇందులో జడ్పీ సీఈఓ, డీపీఓలు కీలక భూమిక పోషిస్తున్నట్లు సమాచారం.


రెండు.. మూడు.. నాలుగు విడతల్లో..

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో వి డత కదిరి, మూడు ధర్మవరం, కళ్యాణదు ర్గం, నాలుగో విడతలో అనంతపురం రెవె న్యూ డివిజన్‌ పరిధిలోని మండలాల్లో వరుసగా ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 1044 పంచాయతీలకుగానూ తొలివిడతగా ఎన్నికలు జరిగే పెనుకొండ రెవె న్యూ డివిజన్లలోని 184 పంచాయతీ లుపో గా మిగిలిన 860 పంచాయతీలకు వరుసగా రెండు, మూడు, నాలుగు విడతల్లో ఎన్నికలు సాగనున్నాయి. ఈ మూడు విడతల ఎన్నిక ల్లో 18,43,324 మంది ఓటర్లు ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. రెండో విడత పల్లెపోరుకు సంబంధించి జనవరి 27న నో టిఫికేషన్‌ జారీ కానుంది. 29 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 31తో ముగుస్తుంది. ఫిబ్రవరి 1న వాటి పరిశీలన ఉం టుంది. 4న నామినేషన్ల ఉపసంహరణ ఉం టుంది. 9న పోలింగ్‌తోపాటు ఓట్లు లెక్కించి, విజేతను ప్రకటిస్తారు.

మూడో విడత ఎన్నికలు జరిగే ధర్మవరం, కళ్యాణ దుర్గం రెవెన్యూ డివిజన్లలకు సంబంధించి జనవరి 31న నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 5న వాటి పరిశీలన, 8న ఉపంసహరణ ఉంటాయి. ఫిబ్రవరి 13న పోలింగ్‌ నిర్వహించటంతోపాటు అదేరోజు ఓట్లు లెక్కించి, విజేతను ప్రకటిస్తారు. నాలుగో విడతలో అనంతపురం పరిధిలోని 19 మండ లాల్లో పంచాయతీ పోరు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 4న ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. ఫిబ్రవరి 6 నుంచి 8వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 9న వాటిని పరిశీలిస్తారు. 12న ఉపసంహరణ ఉంటుంది. 17న పోలింగ్‌ నిర్వహించటంతోపాటు అదేరోజు ఓట్లు లెక్కించి, విజేతను ప్రకటిస్తారు. అ క్కడితో జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోరు ముగియనుంది.

Updated Date - 2021-01-24T07:27:31+05:30 IST