మైక్రో అబ్జర్వర్ల పాత్రే కీలకం

ABN , First Publish Date - 2021-03-06T06:56:52+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమైందని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌, ఎన్నికల శిక్షణ నోడల్‌ అధికారి నరసింహారెడ్డి పేర్కొన్నారు.

మైక్రో అబ్జర్వర్ల పాత్రే కీలకం
మాట్లాడుతున్న ఎన్నికల శిక్షణ నోడల్‌ అధికారి

మున్సిపల్‌ ఎన్నికల శిక్షణ నోడల్‌ అధికారి

అనంతపురం కార్పొరేషన్‌, మార్చి 5: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమైందని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌, ఎన్నికల శిక్షణ నోడల్‌ అధికారి నరసింహారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం జడ్పీ సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్ల విధివిధానాలపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్‌ అధికారి మాటాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ని యమ నిబంధనల మేరకు మైక్రో అబ్జర్వర్లు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాల న్నారు. విధుల్లో భాగంగా ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ను ముం దస్తుగా తెలుసుకోవాలన్నారు. పోలింగ్‌ రోజు ఉదయం 6 గంటలకే పోలింగ్‌ బూత్‌కు చేరుకుని ఎన్నికల ప్రక్రియను మైక్రో అబ్జర్వర్‌ ప్రత్యేకంగా గమనించాల్సి ఉంటుందన్నారు. రిటర్నింగ్‌ అధికారి సమన్వయంతో  పోలింగ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. ఏదైనా సమస్య గాని, సంఘటన గురించి చెప్పాలనుకుంటే వారిపైఅధికారికి తెలపాలన్నారు. పోలింగ్‌స్టేషన్లలో విధుల్లో పాల్గొన్న వారి హాజరు నమోదు, ఏజెంట్ల హాజరు, ఓటు హక్కును వినియోగిం చుకున్న ఓటరు ఎడమ చూపుడు వేలికి చెరగని సిరా గుర్తు పెట్టడం పరిశీలించాలన్నారు. బ్యాలెట్‌ బాక్సుల సీలింగ్‌ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ఆ ప్రక్రియ పూర్తి చేసే వరకు పరిశీలించాలన్నారు. ప్రిసైడింగ్‌ అధికా రి డైరీలో ఎన్నికల సంఘటన అంశాలు ఎప్పటికప్పుడు నమోదు చేయబడుతున్నాయా? లేదా అనేది గమనించా లని, బ్యాలెట్‌ పేపర్‌ ఖాతా కాపీలు పోలింగ్‌ ఏజెంట్లకు ఇచ్చారా లేదా అని గుర్తించాల్సి ఉంటుందన్నారు. మైక్రో అబ్జర్వర్‌ పరిశీలించిన మొత్తం ఎన్నికల ప్రక్రియ ఒక నివేదిక ద్వారా తయారు చేసుకుని జనరల్‌ అబ్జర్వర్‌కు అందజేయాలని నోడల్‌ అధికారి సూచించారు. కార్యక్రమం లో నగరపాలక సంస కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, రిటైర్డ్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు, జిల్లా పరిశ్రమ శాఖ జనరల్‌ మేనేజర్‌ సుదర్శన్‌బాబు, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-06T06:56:52+05:30 IST