‘అమూల్‌’ అమలుకు ఏర్పాట్లు చేయండి

ABN , First Publish Date - 2021-06-17T06:52:02+05:30 IST

జిల్లాలో అమూల్‌ ప్రాజెక్టు అమలుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని జా యింట్‌ కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌.. సంబంధిత అధికారులను ఆదేశించారు.

‘అమూల్‌’ అమలుకు ఏర్పాట్లు చేయండి
మాట్లాడుతున్న జేసీ నిశాంత్‌కుమార్‌

అధికారులకు జేసీ నిశాంత్‌కుమార్‌ ఆదేశం

అనంతపురం, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అమూల్‌ ప్రాజెక్టు అమలుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని జా యింట్‌ కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌.. సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవా రం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పశుసంవర్థక శా ఖాధికారులతో సమావేశమయ్యా రు. అమూల్‌ ప్రాజెక్టు అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... అ మూల్‌ ప్రాజెక్టు కింద జిల్లాలో పాల సేకరణ సజావుగా సాగే లా చర్యలు తీసుకోవాలన్నారు. హిందూపురం, అనంతపురం, కదిరి క్లస్టర్లను అమూ ల్‌ ప్రాజెక్టు అమలుకు జిల్లాలో గుర్తించారన్నారు. ఆయా క్లస్టర్ల వివరాలను అమూల్‌ బృందం.. ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి పంపారన్నారు. జిల్లాలో గుర్తించిన మూడు క్లస్టర్లలో ఏది బాగుంటుందనేది అమూల్‌ బృందం ఎంపిక చేస్తుందన్నారు. ఆ క్లస్టర్లలో రూట్లు ఖరారయ్యాక సంబంధిత వాటి పరిధిలోని గ్రామాల్లో మహిళా డెయిరీ సమాఖ్య సంఘాలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా పాలను సేకరిస్తారన్నారు. అమూల్‌ ప్రాజెక్టు అమలు విషయమై రెండ్రోజుల్లోగా సమగ్ర సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో డీఆర్‌డీఏ, డ్వామా, పశుసంవర్థకశాఖ, డెయిరీ, డిప్యూటీ కో-ఆపరేటివ్‌ అధికారులు కోర్‌ టీమ్‌గా ఉంటారన్నారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ జేడీ వెంకటేష్‌, డిప్యూటీ డైరెక్టర్‌ స్వరూపారాణి, హిందూపురం, పెనుకొండ, అనంతపురం, ధర్మవరం డిప్యూటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T06:52:02+05:30 IST