500 ఆక్సిజన్‌ బెడ్ల ఆస్పత్రితో సీమకు ఉపయోగం

ABN , First Publish Date - 2021-05-09T06:21:03+05:30 IST

పట్టణ సమీపంలోని అర్జాస్‌ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద 500 ఆక్సిజన్‌ బెడ్లు, వెంటిలేటర్‌తో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రి రాయలసీమ జిల్లాలకు ఎంతో ఉపయోగమని మంత్రి శంకరనారాయణ తెలిపారు.

500 ఆక్సిజన్‌ బెడ్ల ఆస్పత్రితో సీమకు ఉపయోగం
స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యంతో మాట్లాడుతున్న మంత్రి

 మంత్రి శంకరనారాయణ

తాడిపత్రి, మే 8: పట్టణ సమీపంలోని అర్జాస్‌ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద 500 ఆక్సిజన్‌ బెడ్లు, వెంటిలేటర్‌తో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రి రాయలసీమ జిల్లాలకు ఎంతో ఉపయోగమని మంత్రి శంకరనారాయణ తెలిపారు. ఆక్సిజన్‌ బెడ్ల తాత్కాలిక ఆస్పత్రి స్థలాన్ని ఎంపీ తలారి రంగయ్య, కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే పెద్దారెడ్డితో కలి సి ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ కరోనా బారిన పడ్డ వారిని రక్షించేందుకు, సకాలంలో ప్రాణవాయువు అందించేందుకు ఈ ఆస్పత్రి ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. అందుకోసం అర్జాస్‌ స్టీల్‌ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడామన్నారు. ఫ్యాక్టరీ నుంచి ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్‌ తరలింపునకు ఇబ్బందులు ఉండటంతో ఆరు ఎకరాల్లో ఫ్యాక్టరీ వద్ద తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఆస్పత్రి కోసం అవసరమైన ఆక్సిజన్‌ను ఫ్యాక్టరీ నుంచి తీసుకుని, కొవిడ్‌ బాధితులకు వైద్యం అందిస్తామన్నారు. ఆక్సిజన్‌ అందించేందుకు ముందుకు వచ్చిన ఫ్యాక్టరీ యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ తాడిపత్రి ప్రాంతంలో తా త్కాలికంగా 500 పడకలతో ఆక్సిజన్‌ ఆస్పత్రిని ఏర్పాటుచేయడం గొప్ప విషయమన్నారు. కలెక్టర్‌ గంధం చంద్రుడు మాట్లాడుతూ కొవిడ్‌ బాధితులకు సత్వర వైద్యసేవలు అందించేందుకు వీలుగా తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫ్యాక్టరీ వద్ద ఉన్న చర్చికి సంబంధించిన స్థలంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం మంత్రి, ఎంపీ, కలెక్టర్‌ కలిసి ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడారు. చర్చి పాస్టర్‌, చర్చి స్కూల్‌ హెడ్‌తో చర్చించారు. వీరివెంట ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం అజయ్‌కుమార్‌, తహసీల్దార్‌ నాగ భూషణం, ప్లాంట్‌ ఇన్‌చార్జ్‌ శివప్రసాద్‌ ఉన్నారు.


సూపర్‌ స్పెషాలిటీ ఆవరణలో ఆక్సిజన్‌ జనరేషన్‌ప్లాంట్‌

అనంతపురం వైద్యం: జిల్లా  కేంద్రంలోని సూపర్‌ స్పెషాలిటీ కొవిడ్‌ కేంద్రం వద్ద ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో ప్లాంట్‌ ఏర్పాటుకు అధికారులు వేగంగా చర్యలు చేపట్టారు. కలెక్టర్‌, జేసీలు, వైద్యాధికారులు, ఆర్‌డీఓ.. ఆస్పత్రి ఆవరణలో ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పరిశీలించారు. ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ తలారి రంగయ్య అక్కడికి చేరుకుని, అధికారులతో చర్చించా రు. అనంతరం ఎంపీ, కలెక్టర్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వార్డులకు వెళ్లి పరిశీలించారు. వసతులు, వైద్య సేవలు బాధితుల ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్‌ సరఫరాపై ఆరా తీసి, సమస్య లేకుండా జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. 


ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం

ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సప్తగిరి క్యాంఫర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఉపాధ్యక్షుడు అనీఫ్‌ రూ.5 లక్షల సాయాన్ని అందజేశారు. కలెక్టర్‌ను కలిసి, రూ.5 లక్షల చెక్కును అందజేశారు.

Updated Date - 2021-05-09T06:21:03+05:30 IST