అక్రమ తవ్వకాలపై రూ.10 కోట్ల జరిమానా

ABN , First Publish Date - 2021-01-24T07:22:32+05:30 IST

లీజు తీసుకున్న ప్రాంతంలో కాకుం డా మరోచోట అక్రమ తవ్వకాలు చేపట్టడంతో గనుల శాఖాధికారులు రూ.10 కో ట్ల జరిమానా విధించారు.

అక్రమ తవ్వకాలపై రూ.10 కోట్ల జరిమానా

అనంతపురం కార్పొరేషన్‌, జనవరి23: లీజు తీసుకున్న ప్రాంతంలో కాకుం డా మరోచోట అక్రమ తవ్వకాలు చేపట్టడంతో గనుల శాఖాధికారులు రూ.10 కో ట్ల జరిమానా విధించారు. గుత్తి మండలంలోని కంకర క్వారీ లీజుకు ఎస్‌ఆర్‌కే సంస్థ అనుమతి తీసుకుంది. అదనంగా కొంత ప్రాంతం లీజుకు కూడా దరఖాస్తు చేసుకుంది. దానికి పర్యావరణ అనుమతులు వచ్చినా గ్రాంట్‌ ఆర్డర్‌ పూర్తిస్థాయిలో రాలేదు. అయినా క్వారీ నిర్వాహకులు దాదాపు 50వేల మెట్రిక్‌ టన్నులు తవ్వేసినట్లు సమాచారం. దీనిపై గనుల శాఖ తాడిపత్రి ఏడీ ఆదినారాయణ.. రూ.10 కోట్ల జరిమానా విధిస్తూ క్వారీ యాజమాన్యానికి నోటీసు పంపారు.

Updated Date - 2021-01-24T07:22:32+05:30 IST