సబ్‌ పోస్ట్‌మాస్టర్‌ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-10-27T10:21:42+05:30 IST

హిందూపురం హెడ్‌పోస్ట్‌ ఆఫీస్‌ పరిధిలోని గోరంట్ల తపాలా కార్యాలయంలో సబ్‌ పోస్ట్‌ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన్‌కుమార్‌ సోమవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.

సబ్‌ పోస్ట్‌మాస్టర్‌ ఆత్మహత్యాయత్నం

ఉన్నతాధికారుల వేధింపులే కారణమన్న బాధితుడు 

 విచారణ చేస్తున్నామన్న ఉన్నతాధికారులు 


హిందూపురం టౌన్‌, అక్టోబరు 26 : హిందూపురం హెడ్‌పోస్ట్‌ ఆఫీస్‌ పరిధిలోని గోరంట్ల తపాలా కార్యాలయంలో సబ్‌ పోస్ట్‌ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన్‌కుమార్‌ సోమవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. హిందూపురం పట్టణంలోని హెడ్‌పోస్ట్‌ఆఫీస్‌ వద్ద ఈ అఘాయిత్యానికి పాల్పడగా అక్కడున్న వారు అడ్డుకుని స్థానిక ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అ నంతరం అనంతపురం ఆసుపత్రికి తర లించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మో హన్‌కుమార్‌ అమరాపురం తపాలాకార్యాల యంలో పని చేసే సమయంలో... 2017 నవంబరు 3న మడకశిర తపాలా కార్యాల యం నుంచి కార్యాలయ అవసరాల నిమి త్తం రూ.2లక్షలు తీసుకెళ్లాడు. అయితే దానిని  తపాలా కార్యాలయం అకౌంట్‌కు జమచేయలేదు. రోజువారి లెక్కల నగదు ఖాతాలో రూ.2లక్షలు వివరాలు రాకపో వడంతో తపాలా అధికారులు సమగ్ర ద ర్యాప్తునకు ఆదేశించారు. విచారణ అధికారి గా పెనుకొండ పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉమా మహేశ్వర్‌ను నియమించారు. ఆయన నాలుగు రోజుల క్రితం అమరాపు రం తపాలా కార్యాలయం వెళ్లి అక్కడ జరిగిన అవకతవకలపై మోహన్‌కుమా ర్‌ను విచారించారు.


మూడు రోజులు గడువు ఇస్తే నిధుల వినియోగంపై సమ గ్ర వివ రాలు అందిస్తానని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాడు. అనంతరం హిందూపురం ప్రఽ దాన తపాలా కార్యాలయానికి వెళ్లాడు. అ క్కడ వివరణ ఇచ్చే సమయంలో యూ నియన్‌ నాయకులతో కలిసి వస్తానని బ యటికి వెళ్లాడు. అయితే కార్యాలయం బ యట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తోటి ఉద్యోగులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. దీనిపై మోహన్‌కుమార్‌ విలేకరు లతో మాట్లాడుతూ... అమరాపురంలో ప నిచేసే సమయంలో కార్యాలయ అవసరా నికి మడకశిర తపాలా కార్యాలయం నుం చి రూ.2లక్షలు తీసుకొచ్చానన్నాడు. ఆ డబ్బును కార్యాలయ అవసరాలకే వినియో గించానని, సాంకేతిక సమస్యల వల్ల వివరాలు చూపించలేకపోతున్నాని తెలిపా డు. అంతేకాక తన సొంత డబ్బు రూ.26 వేలు ఖర్చు చేశానన్నాడు. దానికి సంబం ధించిన వివరాలు అందించినప్పటికీ నాలు గు నెలలుగా విచారణ అధికారి ఉమా మహేశ్వర్‌, హిందూపురం పోస్టల్‌ సూప రింటెండెంట్‌ ఎస్‌ఎండీ బాష వేధింపులు తాళలేకే  ఆత్మహత్య యత్నానికి పాల్ప డ్డా నన్నారు. 


 దీనిపై విచారణ అధికారి ఉమామహేశ్వర్‌ను వివరణ కోరగా... అమరాపురంలో మోహన్‌కుమార్‌ విధులు నిర్వహించే సమయంలో రూ.2లక్షలుతో పాటు మరో రూ.19లక్షల వరకు అవకత వకలు జరిగాయన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నామని, విచారణకు సహకరించాల్సిన ఆయన ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం సరికాదన్నారు. 

Updated Date - 2020-10-27T10:21:42+05:30 IST