పంట రుణాలు రద్దు చేయాలి: సీపీఐ

ABN , First Publish Date - 2020-10-29T09:57:46+05:30 IST

కరువు, కొవిడ్‌ నేపథ్యంలో జిల్లా రైతులకు సంబంధించి పంటరుణాలను భేషరతుగా పూర్తిగా రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు

పంట రుణాలు రద్దు చేయాలి: సీపీఐ

అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 28: కరువు, కొవిడ్‌ నేపథ్యంలో జిల్లా రైతులకు సంబంధించి పంటరుణాలను భేషరతుగా పూర్తిగా రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం నిర్వహించిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ఆన్‌లైన్‌లో మాట్లాడారు. జిల్లాలోని పంట నష్టంపై కలెక్టర్‌ ప్రతిపాదించిన సంఖ్యలు అంకెల గారడిగా ఉన్నాయని, రైతులు పెద్ద ఎత్తున పంటలు నష్టపోయారని క్షేత్రస్థాయిలో అధికారులు తప్పులడకగా నివేదికలు తయారు చేశారని విమర్శించారు. ఎకరాకు రూ.25వేలు పంట నష్టపరిహారం రైతులకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పేదలకు ఇళ్లస్థలాల పంపిణీపై ఈనెల 30న బాధితులతో సదస్సులు, నవంబరు మొదటి వారంలో లబ్ధిదారులతో దీక్షలు, 16న ఇళ్ల స్థలాలను ఆక్రమించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు జాఫర్‌, నారాయణస్వామి, మల్లికార్జున, కాటమయ్య, లింగమయ్య, కేశవరెడ్డి, శ్రీరాములు, అమీనా, పద్మావతి, చలపతి, టి నారాయణస్వామి, గోపాల్‌, గోవిందు, పెద్దయ్య, మధు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-29T09:57:46+05:30 IST