పింఛన్లపై విచారణ

ABN , First Publish Date - 2021-06-18T06:40:04+05:30 IST

జిల్లాలో వితంతు, ఒంటరి పింఛన్లపై విచారణ ఆరంభమైంది.

పింఛన్లపై విచారణ

రేషన్‌ కార్డుల్లో భర్త పేరున్న వితంతు, ఒంటరి మహిళలకు నోటీసులు 

అర్హులైనవారు పక్షం రోజుల్లో సరిచేసుకోవాలంటూ ఉత్తర్వులు

గడువులోగా డాక్యుమెంట్లు సమర్పించకపోతే తొలగింపే

అనంతపురం వ్యవసాయం, జూన్‌ 17 : జిల్లాలో వితంతు, ఒంటరి పింఛన్లపై విచారణ ఆరంభమైంది. వితంతు, ఒంటరి పింఛన్లు తీసుకుంటున్న వారి రేషన్‌ కార్డుల్లో వారి భర్తల పేర్లు యథాతథంగా ఉండటంతో క్షేత్ర స్థాయిలో విచారణకు పూనుకున్నారు. రేషన్‌కార్డుల్లో భర్తల పేరున్నా పింఛన్లు తీసుకుంటున్న వితంతు, ఒం టరి మహిళల జాబితాను తయారు చేశారు. గత వారం రోజులుగా ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్ల ఆధ్వర్యం లో స్థానిక సచివాలయ ఉద్యోగుల ద్వారా అలాంటి వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు జారీ చేసిన పక్షం రోజుల్లో  అర్హులైనవారు భర్త చనిపోయినట్లు మరణ ధ్రు వీకరణ పత్రాన్ని సమర్పించి, సచివాలయాల్లో డెత్‌ డిక్లరేషన్‌ చేయించుకోవడంతోపాటు రేషన్‌ కార్డులో నుంచి తమ భర్త పేరును తొలగించుకోవాల్సి ఉంటుంది. ఆ త ర్వాత తగిన డాక్యుమెంట్లను సంబంధిత సచివాలయ ఉద్యోగికి అందజేయాలి. డాక్యుమెంట్లు సమర్పించిన త ర్వాత సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో వితంతు, ఒం టరి మహిళల పింఛన్లపై ఆరా తీయాలని ఉన్నతాధికారు లు ఆదేశించారు. సమగ్ర విచారణ చేసిన తర్వాతనే ఎంపీడీఓలకు తగిన డాక్యుమెంట్లతో వివరాలు సమర్పిస్తే అలాంటి వారి పింఛన్లను యథాతథంగా కొనసాగించాల ని నిర్ణయించారు. 


రేషన్‌ కార్డులో భర్తల పేర్లున్న వారికి నోటీసులు

జిల్లాలో ప్రతి నెలా 5.29 లక్షల మందికి రూ.130.81 కో ట్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 24459 మంది వితం తు, 15593 మంది ఒంటరి మహిళలు పింఛన్లు పొందుతున్నారు. రేషన్‌కార్డుల్లో భర్తల పేరు ఉంచుకొని పింఛన్లు తీసుకుంటుండటంతో అనర్హులున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే క్షేత్ర స్థాయి విచారణ చేపట్టారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భర్తలతో కలిసున్నా కొందరు ఒంటరి మహిళల కేటగిరిలో పింఛన్లు పొందు తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వితంతు పింఛ న్లలో భర్తలు చనిపోయినప్పటికీ రేషన్‌ బియ్యం కోసం కార్డుల్లో భర్తల పేరు అలాగే ఉంచుకున్నారు. వీరిలో కొం దరు రేషన్‌ కోసం, మరికొందరు అవగాహన లేక తమ భర్తలు చనిపోయినా రేషన్‌ కార్డుల్లో వారి  పేర్లు ఉంచు కున్నారన్న వాదనలు వినిపి స్తు న్నాయి. తాజాగా చేపట్టిన విచారణలో అనర్హుల పింఛన్లు కోత పడనున్నాయి. మరో వైపు రేషన్‌కార్డుల్లో భర్తల పేరు ఉండటంతో నిజమైన అర్హులకు నోటీసులు జారీ చేశారు. పక్షంరోజుల్లోగా తగిన డాక్యుమెంట్లు సమర్పించాలని, లేకపోతే పింఛన్లు ఆగిపో తాయని సచివాలయ సిబ్బంది చెబుతుండటంతో లబ్ధిదా రులు ఆందోళన చెందుతున్నారు. పక్షం రోజుల సమయా న్ని మరికొన్ని రోజులు పొడిగించి అర్హులకు న్యాయం చేయాలని ఆ వర్గాలు కోరుతున్నాయి. 


అనర్హులని తేలితే పింఛన్‌ తొలగింపు : నరసింహారెడ్డి,  పీడీ, డీఆర్‌డీఏ

రేషన్‌కార్డుల్లో భర్తల పేర్లున్నా వితంతు, ఒంటరి మహిళా పింఛన్లు తీసుకుంటున్న వారిపై విచారణ చేపట్టాం. సచివాలయ సిబ్బంది నోటీసులు జారీ చేసిన పక్షం రోజు ల్లోగా తగిన డాక్యుమెంట్లు సమర్పించాలి. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయి విచారణలో అనర్హులని తేలితే ఆ యా పింఛన్ల జాబితాను ఉన్నతాధికారులకు పంపించి తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. నిజమైన అర్హులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 

Updated Date - 2021-06-18T06:40:04+05:30 IST