రేపు రేవా యూనివర్సిటీ ప్రత్యేక కెరీర్‌ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2021-07-30T06:24:05+05:30 IST

ఇంజనీరిం గ్‌ విద్యార్ధుల కోసం బెంగళూ రు నగరంలోని రేవా యూనివర్సిటీ శనివారం అనంతపురంలో ప్రత్యేక కెరీర్‌ కౌన్సెలింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

రేపు రేవా యూనివర్సిటీ ప్రత్యేక కెరీర్‌ కౌన్సెలింగ్‌

బెంగళూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి):  ఇంజనీరిం గ్‌ విద్యార్ధుల కోసం బెంగళూ రు నగరంలోని రేవా యూనివర్సిటీ శనివారం అనంతపురంలో ప్రత్యేక కెరీర్‌ కౌన్సెలింగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు  ఓ ప్రకటనలో తెలిపింది. ఏ కోర్సులో చేరితే అద్భుతంగా రాణించి కెరీర్‌ను మలుచుకోవచ్చో విద్యార్థులకు ఈ  ప్రత్యేక కౌన్సెలింగ్‌  సదస్సులో తెలియజేయనున్నా రు. సదస్సును ఉద్దేశించి రేవా యూనివర్సిటీ వైస్‌ చాన్సెలర్‌ డా.ఎం.ధనుంజయ ప్రత్యేక  ప్రసంగం చేయనున్నారు. అనంతపురంలోని రాజు రోడ్డులో ఉన్న హోటల్‌ మాసినేని గ్రాండ్‌లో నిర్వహించే ఈ కౌన్సెలింగ్‌కు ఆసక్తి గల విద్యార్థులు హాజరుకావాలని కోరారు.  మరిన్ని వివరాల కోసం 99722 41717కు సంప్రదించాలని తెలిపారు. 

Updated Date - 2021-07-30T06:24:05+05:30 IST