Advertisement

పోలీసులు, వలంటీర్లు, డబ్బు..

Mar 3 2021 @ 01:52AM
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టీడీపీ జిల్లా ఇన్‌చార్జి బీటీ నాయుడు

 • వీటి చుట్టూనే ఎన్నికలు
 • వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు విలువ లేదాయె..
 • ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై దౌర్జన్యాలు, దాడులు
 • చంద్రబాబును విమానాశ్రయంలో నిర్బంధించటం దారుణం
 • మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పాలి
 • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, టీడీపీ జిల్లా సమన్వయకర్త బీటీ నాయుడు
 • అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 2: దేశంలో ఎక్కడాలేని విధంగా పోలీసులు.. వలంటీర్లు.. డబ్బు.. చుట్టే రాష్ట్రంలో ఎన్నికలు తిరుగుతున్నాయనీ, ప్రజాప్రతినిధులను సైతం జీరో చేస్తూ రౌడీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాలిస్తున్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, టీడీపీ జిల్లా ఇన్‌చార్జి బీటీ నాయుడు విమర్శించారు. మంగళవారం స్థానిక నీలం రాజశేఖర్‌రెడ్డి భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. రా మకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు విలువ లేకుండా పో యిందన్నారు. ఎన్నికల్లో మొత్తం పోలీసులు, వలంటీర్లు, డబ్బుతో వ్యవహారం నడిపిస్తున్న తీరుకు సీఎం జగన్‌రెడ్డికి డాక్టరేట్‌ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను బెదిరించి, దౌర్జన్యంగా ఏకగ్రీవాలు చేసుకోవడానికి పోలీసులు సహకరించటం దుర్మార్గమన్నారు. వలంటీర్లు ఇళ్ల వద్దకు వెళ్లి, వైసీపీకి ఓటు వేయకపోతే రేషన్‌, పింఛన్‌, ఇంటి స్థలం, సంక్షేమ పథకాలు కట్‌ చేస్తామని ప్రజలను భయభ్రాంతులకు లోనుచేయటం దారుణమన్నారు. వీళ్లే అంతా వ్యవహారం నడుపుతుంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు, వైసీపీ నాయకులు గాడిదలు కాస్తున్నారా.. అని ప్రశ్నించారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబును 9 గంటలపాటు రేణిగుంట విమానాశ్రయంలో నిర్బంధించటం అప్రజాస్వామిక చర్య అని తీవ్రంగా ఖండించారు. గతంలో విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌మోహన్‌రెడ్డిని నిర్బంధించడాన్ని తమ పార్టీ అప్పట్లో ఖండించిందనీ, ఇది తప్పు అని తెలిసి అదే తప్పును అధికారంలోకి వచ్చి జగన్‌ ఎందుకు చేశారని నిలదీశారు. టీడీపీ జిల్లా ఇన్‌చార్జి బీటీ నాయుడు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అప్రజాస్వామికంగా రేణిగుంట ఎయిర్‌పోర్టులో నిర్బంధించి, కక్షసాధింపులకు పాల్పడటం 11 కేసుల్లో ఏ1 ముద్దాయిగా రోజూ కోర్టులకు హాజరయ్యే సీఎం జగన్‌రెడ్డి దుర్మార్గపు పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై గళం ఎత్తుతూ, వైసీపీ అరాచ కాలను కలెక్టర్‌, ఎస్పీల దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్లిన చంద్రబాబును నేలపై, కూర్చోబెట్టి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు. అధికార దుర్వినియోగాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని 10న జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెబుతారన్నా రు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే 200 శాతం స్థానాలు గెలుచుకున్న చరిత్ర వైసీపీకే దక్కిందని ఎద్దేవా చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్‌ మాట్లాడుతూ వలంటీర్లు, పోలీసులు.. వైసీపీ కండువాలు వేసుకుని, ప్రచారం చేస్తే బాగుంటుందని హితవు పలికారు.
 • Follow Us on:
  Advertisement
  అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
  For internet advertisement and sales please contact
  Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
  Designed & Developed by AndhraJyothy.