ఉక్కరి బిక్కిరి

ABN , First Publish Date - 2021-04-23T06:24:39+05:30 IST

గత నాలుగు రోజులుగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో జిల్లాలో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు.

ఉక్కరి బిక్కిరి

బుక్కరాయసముద్రం, ఏప్రిల్‌ 22: గత నాలుగు రోజులుగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో జిల్లాలో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఆకాశం మేఘా వృతం కావడం వల్ల  ఉక్కపోత ఎక్కువగా ఉందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త అశోక్‌కమార్‌ తెలిపారు. జిల్లాలో గురు వారం పగటి ఉ ష్ణోగ్రతలు పరి శీలిస్తే శింగనమలలో 40.1 డిగ్రీల సెల్సియస్‌, పుట్లూ రు, యల్లనూరులో  40, గుంతకల్లులో 39.7, కదిరి 39.7, ధర్మ వరం 39.5, తాడిమర్రి 38.8, పామిడి 38.4, ఎన్పీకుంట 38.5, బుక్కరాయసముద్రం 38.4 డిగ్రీలు నమోదు కాగా అత్యల్పంగా అమ రాపురం 34.9 డిగ్రీలు సెల్సియస్‌ నమోదు అయ్యింది.

Updated Date - 2021-04-23T06:24:39+05:30 IST