జిల్లా ఓటర్లు 33.28 లక్షలు

ABN , First Publish Date - 2021-01-16T06:24:47+05:30 IST

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో తుది ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరికి ఎన్నికల విభాగం అధికారులు శుక్రవారం తుది ముసాయిదా ఓటర్ల జాబితాను అందజేశారు.

జిల్లా ఓటర్లు 33.28 లక్షలు

పురుష ఓటర్లే అధికం

29 శాతానికిపైగా యువ ఓటర్లు 

కొత్తగా ఓటు హక్కు పొందిన వారు తక్కువే

తుది ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల  

అనంతపురం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి) : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో తుది ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరికి ఎన్నికల విభాగం అధికారులు శుక్రవారం తుది ముసాయిదా ఓటర్ల జాబితాను అందజేశారు. జిల్లాలోని 14 నియోజకవర్గాలకుగానూ మొత్తం 33,28,931 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 16,64,761 మంది ఉండగా మహిళా ఓటర్లు 16,63,888 మంది ఉన్నారు. అంటే జిల్లాలో మహిళా ఓటర్లకంటే పురుష ఓటర్లు 873 మంది అధికంగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో యువ ఓటర్లు 29 శాతానికిపైగా ఉన్నారు. ఆ తరువాతి స్థానం నడివయస్కులు అంటే 40-49 ఏళ్లలోపు వారు 21 శాతం మంది ఉన్నారు. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు 18-19 ఏళ్లలోపు వారు పెద్దగా ఆసక్తి చూపలేదనే చెప్పాలి.  జిల్లాలో దాదాపు 40 వేల మందికి పైగా ఆ వయస్సు వారు ఉన్నప్పటికీ 23,855 మంది మాత్రమే ఓటర్లుగా జాబితాలోకెక్కారు. అనంతపురం అర్బన్‌లో అత్యధికంగా 2,72,141 మంది ఓటర్లుండగా... అత్యల్పంగా పుట్టపర్తిలో 2,02,610 మంది ఓటర్లున్నారు.  కాగా... మిలిటరీలో పనిచేసే వారిని సర్వీస్‌ ఓటర్లుగా పరిగణిస్తారు. వీరు జిల్లాలో 3328 మంది ఉన్నారు. 


ఆరు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం

జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా అందులో ఆరు ని యోజకవర్గాల్లో పురుష ఓటర్లకంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రా యదుర్గం నియోజకవర్గంలో 127484 మంది పురుష ఓటర్లుండగా మహిళా ఓటర్లు 127879 మం ది ఉన్నారు. 395 మంది మహిళా ఓట ర్లు అధికంగా ఉన్నా రు. ఉరవకొండలో 108258 మంది పురుష ఓటర్లుండగా.... మహిళా ఓటర్లు 109211 మంది ఉన్నారు. ఇక్కడ 953 మంది మహిళా ఓటర్లే అధికం. గుంతకల్లు నియోజకవర్గంలో 130633 మంది పురుష ఓటర్లుండగా... మహిళా ఓటర్లు 132949 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే 2316 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా రు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో 134519 మంది పురుష ఓటర్లుండగా... మహి ళా ఓటర్లు 137571 మంది ఉన్నారు. అంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 3052 మంది ఎక్కువగా ఉన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో 121321 మంది పురుష ఓటర్లుండగా మహిళా ఓటర్లు 122491 మంది ఉన్నారు. ఇక్కడ 1170 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. కదిరి నియోజ కవర్గంలో 123430 మంది పురుష ఓటర్లుండగా 124833 మంది మహిళా ఓటర్లున్నారు. 1403 మంది మహిళా ఓటర్లు ఈ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. 


యువత...ఆ తరువాతి స్థానం నడివయస్కులదే....

జిల్లా ఓటర్లలో యువత ఓటర్లు అధికంగా ఉన్నారు. ఆ తరువాతి స్థానం నడివయస్కులదే. జిల్లాలో మొత్తం 33,28,931 ఓటర్లుండగా అందులో 9,63,903 మంది యు వ ఓటర్లు  ఉన్నారు. అంటే దాదాపు 29 శాతం యువ ఓటర్లున్నారు. ఆ తరువాతి స్థానంలో నడి వయస్కు లు(40-49) 7,08,612 మంది ఓటర్లున్నారు. అంటే నడి వయస్కులు 21 శాతం మందికిపైగా ఉన్నారు. మూడో స్థానంలో 20-29 ఏళ్ల వయస్సు ఓటర్లు 670807 మంది ఉన్నారు. 20 శాతం మంది(టీనేజర్లు) ఉన్నారు. నూతన ఓటర్లు(18-19) సంఖ్య కేవలం 23,855 మంది ఉన్నారు. 

Updated Date - 2021-01-16T06:24:47+05:30 IST