గణతంత్ర వేడుకల్లో లేపాక్షి వైభవం

ABN , First Publish Date - 2021-01-24T07:23:17+05:30 IST

లేపాక్షి శిల్పకళావైభవం ఢిల్లీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది.

గణతంత్ర వేడుకల్లో లేపాక్షి వైభవం

లేపాక్షి, జనవరి 23: లేపాక్షి శిల్పకళావైభవం ఢిల్లీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఈనెల 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌ వేదికగా నిర్వహించే గణతంత్ర వేడుకల్లో ఏపీ తరపున లేపాక్షి శకటాన్ని ప్రదర్శించనున్నట్లు పర్యాటక శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ ఈశ్వరయ్య తెలిపారు. శకటం ముందు 27 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుతో  అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ప్ర త్యేకాకర్షణగా నిలవనుంది. అర్ధంతరంగా ఆగిన కల్యాణమంటపం, ఏడు శిరసుల నాగేంద్రుడు, శివలిం గం, వీరభద్రుడి ఉగ్ర రూ పాన్ని, పెద్దరాతిపై వినాయకుడు, శిల్పకళా నైపుణ్యం ప్రదర్శించనున్నారు. టీడీపీ పాలనలోనే లేపాక్షి ఉత్సవాల ను వైభవంగా నిర్వహించి, ప్రపంచ నలుమూలలా ఖ్యాతిని చాటా రు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం గణతంత్ర వేడుకల్లో లేపాక్షి చరిత్రను శకటం రూపంలో దేశ రాజధానిలో ప్రదర్శించనుంది.

Updated Date - 2021-01-24T07:23:17+05:30 IST