ఉత్తరప్రదేశ్‌లో దారుణం

ABN , First Publish Date - 2020-11-19T19:00:25+05:30 IST

ఓ వివాహితుడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి...

ఉత్తరప్రదేశ్‌లో దారుణం

పెళ్లి చేసుకుంటానంటూ నర్సుపై అఘాయిత్యం 

బారౌత్ (ఉత్తరప్రదేశ్):  ఓ వివాహితుడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఓ నర్సుపై అఘాయిత్యం చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారౌత్  పట్టణంలో వెలుగుచూసింది. బారౌత్ పట్టణానికి చెందిన ఓ వివాహితుడు నర్సును పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలైన నర్సుపై వివాహితుడి భార్య, ఆమె సోదరుడు దాడి చేసి కొట్టారు. పెళ్లి అయిన వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని బాధిత నర్సు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడు, అతని భార్య, సోదరుడిపై కేసు పెట్టారు. దాడి చేసిన భార్య, ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు  పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నాని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-11-19T19:00:25+05:30 IST