విద్యుత్‌ సబ్‌స్టేషన్‌పై సర్పంచ్‌ భర్త దాడి

ABN , First Publish Date - 2021-03-01T05:03:28+05:30 IST

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌పై సర్పంచ్‌ భర్త దాడి

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌పై సర్పంచ్‌ భర్త దాడి
సబ్‌స్టేషన్‌ కంట్రోల్‌ రూంలో ధ్వంసమైన ఫర్నిచర్‌, ప్యానల్‌ బోర్డు

ఫర్నిచర్‌, విద్యుత్‌ సామగ్రి ధ్వంసం

ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు 

ఖానాపురం, ఫిబ్రవరి 28 : విద్యుత్‌ సబ్‌స్టేషన్‌పై సర్పంచ్‌ భర్త దాడి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌పై దాడి చేసి ఫర్నిచర్‌, విద్యుత్‌ పరి కరాలను ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, అధికారుల కథనం ప్రకారం. భద్రుతండాలో ఈ నెల 25న విద్యుత్‌ సరఫరా నిలిచిపోవ డంతో సర్పంచ్‌ గుగులోతు పద్మ భర్త అశోక్‌ విద్యుత్‌ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. విద్యుత్‌ పునరుద్ధరణలో జాప్యం జరగడంతో మద్యం మత్తులో అశోక్‌ మంగళవారిపేటలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ కు వచ్చి సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. కార్యాలయంలోని ఫర్నిచర్‌ ధ్వంసం చేసి, ట్రాన్స్‌ఫార్మర్‌పై రాళ్లు విసరడంతో అది ధ్వంసమైందని అధికారులు తెలిపారు. విషయ మై ఏఈ సంపత్‌ను వివరణ కోరగా అశోక్‌ విధులకు ఆటంకం కలిగించి, సామగ్రిని ధ్వంసం చేసిన మాట వాస్తవమేనని, ఆదివారం పోలీస్‌లకు ఫిర్యాదు చేసినట్టు తెలిపా రు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటయ్య తెలిపారు. 


Updated Date - 2021-03-01T05:03:28+05:30 IST