నలుగురు కానిస్టేబుళ్లు అటాచ్‌మెంట్‌

ABN , First Publish Date - 2021-10-24T04:43:30+05:30 IST

విధి నిర్వహణలో బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన నలుగురు కాని స్టేబుళ్లను, ఒక హోంగార్డును ఏఆర్‌ హెడ్‌క్వార్టర్లకు అటాచ్‌ చేస్తు శనివారం పోలిస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

నలుగురు కానిస్టేబుళ్లు అటాచ్‌మెంట్‌

ఖమ్మంక్రైం, అక్టోబరు23: విధి నిర్వహణలో బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన నలుగురు కాని స్టేబుళ్లను, ఒక హోంగార్డును ఏఆర్‌ హెడ్‌క్వార్టర్లకు అటాచ్‌ చేస్తు శనివారం పోలిస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొణిజర్ల పోలిస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు విధులలో ఉండి ఓ వేడుకకు వెళ్తున్నారు. దారిలో ఓ బెల్టు షాపు వద్ద మద్యం తాగారు. ఈవిషయంపై శుక్రవారం వారిని సీపీ తన కార్యాలయానికి పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే. క్రమశిక్షణ చర్యలలో భాగంగా వారిని అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2021-10-24T04:43:30+05:30 IST