వెస్టు ప్యారిస్‌ చర్చి క్వార్టర్లో వ్యక్తిపై దాడి

ABN , First Publish Date - 2021-08-03T06:05:39+05:30 IST

కొద్ది రోజులుగా వెస్టు ప్యారిస్‌ చర్చిలో జరుగుతున్న వివాదం మరింత ముదిరింది. సోమవారం రాత్రి 10.15 గంటల సమయంలో కొందరు వ్యక్తులు కర్రలు, రాడ్లతో చేసిన దాడిలో ప్రకాశం జిల్లా చర్రుబాడు బీఎడ్‌ కళాశాల కరస్పాండెంట్‌ కృపాకర్‌కు తీవ్రగాయాలయ్యాయి.

వెస్టు ప్యారిస్‌ చర్చి క్వార్టర్లో వ్యక్తిపై దాడి
గాయపడిన కృపాకర్‌

బీఎడ్‌ కళాశాల కరస్పాండెంట్‌కు తీవ్ర గాయాలు

గుంటూరు, ఆగస్టు 2: కొద్ది రోజులుగా వెస్టు ప్యారిస్‌ చర్చిలో జరుగుతున్న వివాదం మరింత ముదిరింది. సోమవారం రాత్రి 10.15 గంటల సమయంలో కొందరు వ్యక్తులు కర్రలు, రాడ్లతో చేసిన దాడిలో ప్రకాశం జిల్లా చర్రుబాడు బీఎడ్‌ కళాశాల కరస్పాండెంట్‌ కృపాకర్‌కు తీవ్రగాయాలయ్యాయి. చర్చిలో ఆధిపత్యం కోసం కొద్దిరోజులుగా పాస్టర్లు జేసుదానం, రవికిరణ్‌ల మధ్య గొడవ జరుగుతోంది. ఇప్పటివరకు జేసుదానం పాస్టర్‌గా కొనసాగుతుండగా రెండువారాల క్రితం రవికిరణ్‌ను పాస్టర్‌గా ఏలియా నియమించారు. వీరిద్దరూ చర్చిలో ప్రార్థనల కోసం పోటీపడుతుండడంతో చర్చిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలావుంటే సోమవారం రాత్రి చర్చి కాంపౌండ్‌లోని క్వార్టర్స్‌లో పాస్టర్‌ జేసుదానం కొందరితో మాట్లాడుతుండగా బయట బీఎడ్‌ కళాశాల కరస్పాండెంట్‌ కృపాకర్‌, ఆయన కారు డ్రైవర్‌ ఉన్నారు. ఇంతలో గోడ దూకి లోనికి వచ్చిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాడ్లతో కృపాకర్‌పై దాడిచేయటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను జీజీహెచ్‌కు తరలించారు. లాజరస్‌, ఆయన తమ్ముడు, మరికొందరు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని కృపాకర్‌, జేసుదానం తెలిపారు. దీనిపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2021-08-03T06:05:39+05:30 IST