చికిత్సలో జాప్యం చేశారని.. వైద్యుడిపై రోగి బంధువుల దాడి

ABN , First Publish Date - 2021-07-26T06:24:06+05:30 IST

ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో మహిళా రోగికి చికిత్స విషయంలో డాక్టర్లు సరిగా పట్టించుకోవడం లేదంటూ ఆమె బంధువులు డ్యూటీ డాక్టర్‌పై దాడి చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మహబూబ్‌ఖాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చికిత్సలో జాప్యం చేశారని..  వైద్యుడిపై రోగి బంధువుల దాడి

అమీర్‌పేట్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో మహిళా రోగికి చికిత్స విషయంలో డాక్టర్లు సరిగా పట్టించుకోవడం లేదంటూ ఆమె బంధువులు డ్యూటీ డాక్టర్‌పై దాడి చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మహబూబ్‌ఖాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన ఓ మహిళ(55) బీపీ, షుగర్‌, ఆస్తమాతో బాధపడుతున్నారు. రోజూ చికిత్స పొందుతున్న ఆమెకు ఆదివారం చికిత్సలో జాప్యం జరిగింది. సెలవు దినం కావడంతో కొందరు డాక్టర్లు ఆలస్యంగా వచ్చారని, డ్యూటీ డాక్టర్‌ కృష్ణన్‌ నంబూద్రి పర్యవేక్షణలో ఆమెకు చికిత్స చేస్తున్నారని తెలిపారు. చికిత్సలో ఆలస్యం జరిగిందని ఆరోపిస్తూ రోగి బంధువులు జిలానీ, మరో ఆరుగురు ఆవేశంతో డాక్టర్‌పై దాడిచేసినట్లు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-26T06:24:06+05:30 IST