అధికారుల సమక్షంలో భౌతిక దాడులా..?

ABN , First Publish Date - 2021-03-02T06:19:07+05:30 IST

తహసీల్దార్‌ సమక్షంలోనే టీడపీ నేతలపై వైసీపీ నాయకులు భౌతిక దాడికి దిగడాన్ని ఖండిస్తున్నట్లు అఖిలపక్ష నాయకులు సోమవారం తెలిపారు.

అధికారుల సమక్షంలో భౌతిక దాడులా..?
సమావేశంలో మాట్లాడుతున్న హరిబాబు

పామూరు, మార్చి 1: తహసీల్దార్‌ సమక్షంలోనే టీడపీ నేతలపై వైసీపీ నాయకులు భౌతిక దాడికి దిగడాన్ని ఖండిస్తున్నట్లు అఖిలపక్ష నాయకులు సోమవారం తెలిపారు. ఎంపీడీవో రంగ సుబ్బరాయుడిపై వచ్చిన అభియోగాలపై  తహసీల్దార్‌  కార్యాలయంలో శనివారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా  టీడీపీ శ్రేణులు తహసీల్దార్‌కు సమస్యను వివరిస్తున్నారు. ఆ సమయంలో విచారణకు సంబంధం లేకపోయినా వైసీపీ నాయకులు అక్కడకు వచ్చారు. నేరుగా టీడీపీ నాయకులపై భౌతిక దాడికి దిగడాన్ని ఖండిస్తున్నట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు. స్థానిక శేష మహల్‌ ఆవరణలో సోమవారం సాయంత్రం అఖిలపక్ష పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ క్రమశిక్షణకు మారుపేరని టీడీపీ అని అల్లరి మూకల దాడులకు భయపడేది లేదన్నారు. అధికారం ఉంది కదా అని దాడులు చేస్తే సహించేది లేదని తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్‌డీ మౌలాలి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లోనే ప్రతిపక్ష నాయకులకు రక్షణ కరువైందన్నారు. దొమ్మీగా వచ్చి దాడులకు తెగబడటం మండలంలో ఇదే ప్రథమమని ఇలాంటి సాంప్రదాయాలు గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. సీపీఎం మండల కమిటీ కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో వ్యక్తిగత దాడులకు ఆస్కారం లేదన్నారు.  సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు బీవీ భోజయ్యచారి, మాజీ కో ఆప్షన్‌ ఖాజా రహంతుల్లా, ఎం గంగరాజు యాదవ్‌, మన్నం రమణయ్య, దారపనేని మాధవరావు, పువ్వాడి రామారావు, గౌస్‌బాషా, ఎం వెంకట్రావు, వై ప్రసాద్‌రెడ్డి, ఆర్‌ఆర్‌ రఫి, మాచర్ల రహిమాన్‌, సాంబయ్య, ముబీనా మౌలాలి, తోటా రవి, కె సుభాషిణి, కౌలూరి ఖాజా రహంతుల్లా, సిపిఎం వార్డు సభ్యులు షేక్‌ మస్తాన్‌, ఇస్మాయిల్‌, వజ్రాల సుబ్బారావు, వై ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T06:19:07+05:30 IST