విదేశాల్లోని భారతీయులపై దాడుల అంశం.. కీలక విషయాలు చెప్పిన ప్రభుత్వం!

ABN , First Publish Date - 2021-03-26T02:10:54+05:30 IST

భారత ప్రభుత్వం గురువారం రోజు కీలక విషయాలను వెల్లడించింది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులపై 2018-2020 మధ్య కాలంలో చోటుచేసుకున్న దాడులకు సంబంధించిన వివరాలను పార్లమెంట్‌లో

విదేశాల్లోని భారతీయులపై దాడుల అంశం.. కీలక విషయాలు చెప్పిన ప్రభుత్వం!

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం గురువారం రోజు కీలక విషయాలను వెల్లడించింది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులపై  2018-2020 మధ్య కాలంలో చోటుచేసుకున్న దాడులకు సంబంధించిన వివరాలను పార్లమెంట్‌లో తెలియజేసింది. 2018-2020 మధ్య విదేశాల్లోని భారతీయులపై దాడికి సంబంధించిన కేసులు 94 నమోదయ్యాయని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ పేర్కొన్నారు. ఇందులో అత్యధిక కేసులు ఇథియోపియాలోనే నమోదైనట్టు చెప్పారు. మూడేళ్లలో ఇథియోపియాలోని భారతీయులపై 17సార్లు దాడులు జరిగినట్టు వెల్లడించారు. ఇథియోపియా తర్వాత అమెరికా, ఐర్లాండ్‌లలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదైనట్టు తెలిపారు. 2018-2020 మధ్య కాలంలో అమెరికా, ఐర్లాండ్‌లోని భారతీయులపై వరుసగా 16, 14 సార్లు దాడులు జరిగినట్టు వెల్లడించారు. ఇదే సమయంలో పోలాండ్‌లో-8, కెనడాలో-6, ఫ్రాన్స్‌లో-5, చైనాలో-1, శ్రీలంకలో-4 ఘటనలు చోటు చేసుకున్నట్టు వివరించారు. అంతేకాకుండా విదేశాల్లోని భారతీయులపై ఏ చిన్న దాడి జరిగినా అది ప్రభుత్వం దృష్టికి వస్తుందన్నారు. దీంతో వెంటనే ప్రభుత్వం స్పందించి.. సంబంధిత దేశ అధికారుల దృష్టికి ఆ ఘటనను తీసుకెళ్లి.. భారతీయులకు రక్షణ కల్పించాల్సిందిగా ఆయా ప్రభుత్వాలను కోరుతున్నట్టు చెప్పారు. 


Updated Date - 2021-03-26T02:10:54+05:30 IST